Hyderabad Lok Sabha Constituency : ఎంఐఎం పార్టీకి కంచుకోట‌గా హైద‌రాబాద్ పార్లమెంట్…..పట్టు సాధించడం కోసం కాంగ్రెస్, బీజెపీల ప్రయత్నాలు

తెలంగాణలో హిందూ ఓట్ పోలరైజేషన్‌ చేయొచ్చన్నది కమలం పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. రాజాసింగ్ కాకపోతే.. టైగర్ నరేంద్ర కుమారుడు జితేందర్‌, మాజీ డిప్యూటి మేయ‌ర్ సుభాచంద‌ర్, మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌లో ఒకరిని బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయ్.

Hyderabad Lok Sabha Constituency : ఎంఐఎం పార్టీకి కంచుకోట‌గా  హైద‌రాబాద్ పార్లమెంట్…..పట్టు సాధించడం కోసం కాంగ్రెస్, బీజెపీల ప్రయత్నాలు

Hyderabad Lok Sabha Constituency :

Hyderabad Lok Sabha Constituency : హైద‌రాబాద్ పార్లమెంట్… దేశంలోనే ప్రత్యేక‌త కలిగిన లోక్‌సభ స్థానం. ఇప్పటివరకు ఈ స్థానానికి 17సార్లు ఎన్నికలు జరిగితే.. మొదట్లో ఏడుసార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 1984 నుంచి వ‌రుస‌గా 10సార్లు ఎంఐఎం గెలుస్తూ వస్తోంది. దేశంలోనే ఎంఐఎం పార్టీకి.. నిషాన్‌గా మారింది హైదరాబాద్‌. ఐతే రాష్ట్రంలో, దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న వేళ.. ఇక్కడ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయ్. అంద‌ని ద్రాక్షలా ఉన్న హైద‌ర‌బాద్ పార్లమెంట్‌పై బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ వ్యూహాలు ఏంటి.. గోషామహాల్‌ను బీజేపీ నిలబెట్టుకుంటుందా.. ఏ అసెంబ్లీలో రాజకీయం ఏం చెప్తోంది.. ఇంతకీ చార్ సౌ సాల్ ష‌హ‌ర్ పరిధిలోని అసెంబ్లీల్లో బరిలో నిలిచే రేసుగుర్రాలు ఎవరు..

Hyderabad

Hyderabad

READ ALSO : Kammam Politics : ఖమ్మం చుట్టూ తిరుగుతున్న తెలంగాణా రాజకీయం… గులాబీ పార్టీలో గ్రూపుల గుబులు

హైదరాబాద్ పార్లమెంట్ విషయంలో ఎంఐఎం, బీఆర్ఎస్ దోస్తీ కంటిన్యూ అవుతుందా ?

దేశరాజకీయాల్లో హైదరాబాద్‌ లోక్‌సభకు ప్రత్యేక స్థానం ఉంది. నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ నగరానికి గుర్తుగా.. ఈ లోక్‌సభ స్థానం ఉంది. పార్లమెంట్ పరిధిలోని 7అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు… పాతబస్తీ ప్రాంతంలోనే ఉన్నాయ్. హైదరాబాద్‌ పార్లమెంట్‌కు ఇప్పటివరకు 17సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే.. అందులో ఏడుసార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. వరుసగా పదిసార్లు ఎంఐఎం పార్టీ గెలుస్తూ వస్తోంది. 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అహ్మద్ మొహియుద్దీన్ గెలిచారు. 1957లో వినాయ‌క్ రావు కోరాట్కర్ గెలవగా.. ఆ తర్వాత జీఎస్ మేల్కోటి మూడుసార్లు.. కేఎస్ నారాయణ రెండుసార్లు విజయం సాధించారు. 1984లో తొలిసారి హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ నుంచి చేజారిపోయింది. 1984లో ఎంఐఎం అధినేత సుల్తాన్ స‌ల్లావుద్దీన్ ఓవైసీ మొదటిసారి విజయం సాధించారు. ఆయన వరుసగా ఆరుసార్లు గెలవగా.. సల్లావుద్దీన్ తర్వాత ఆయ‌న కుమారుడు అస‌దుద్దీన్ ఒవైసీ వ‌రుస‌గా నాలుగుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు.

BJP, CONGRESS

BJP, CONGRESS

చార్మినార్‌పై జెండా పాతేందుకు బీజేపీ వ్యూహాలు…. పూర్వవైభవం కోసం కాంగ్రెస్‌ చేస్తున్న ప్రయత్నాలు ఏంటి ?

వ‌రుస విజ‌యాల‌తో హైద‌రాబాద్ పార్లమెంట్ ఎంఐఎం పార్టీకి కంచుకోట‌గా మారింది. ఈ పార్లమెంట్ పరిధి మొత్తం పాతబస్తీ ప్రాంతం కావడంతో.. ఎంఐఎం సూపర్ స్ట్రాంగ్ అయింది. హైదరాబాద్‌ ఎంపీ స్థానంపై పట్టు సాధించడం కోసం కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలితం లేకుండా పోతోంది. ఎంఐఎం అధిపత్యం ముందు.. హస్తానికి ప్రతీసారి ఓటమే మిగిలింది. అటు బీజేపీ కూడా ఈ స్థానంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బీజేపీలో ఒకప్పుడు అగ్రనేత‌గా ఉన్న బ‌ద్దం బాల్ రెడ్డి.. సుల్తాన్ స‌ల్లావుద్దీన్ ఓవైసీ మధ్య పోటాపోటీ రాజకీయం నడిచింది. 1991 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన బద్దం బాల్ రెడ్డి.. తక్కువ తేడాతో ఓడిపోయారు. 1996ఎన్నిక‌ల్లో ఇక్కడి నుంచి బీజేపీ అగ్రనేత వెంక‌య్య నాయుడు పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో కేవలం 73వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ రెండుసార్లు మాత్రమే కమలం పార్టీ పోటీ ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికలోనూ ప్రభావం చూపించలేకపోయింది. కాంగ్రెస్‌ పరిస్థితి కూడా దాదాపు సేమ్! ఎంఐఎం దోస్తీ కారణంగా హైద‌రాబాద్ లోక్‌సభను గులాబీ పార్టీ వదిలేసింది. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీలోనూ పోటీకి దూరంగా ఉంటూ.. ఎంఐఎంతో మిత్రపక్షంగా కొనసాగుతోంది. ఎంఐఎం నుంచి మళ్లీ అసదుద్దీన్ బరిలో దిగబోతుండగా.. ఓడిపోయే సీటే అనే అంచనాతో మిగతా పార్టీల నుంచి చివరి నిమిషయంలోనే అభ్యర్థులను ప్రకటిస్తారు. ఐతే హైదరాబాద్ స్థానంపై ఈసారి బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. భాగ్యలక్ష్మి ఆలయం కేంద్రంగా రాజకీయాలు వేగవంతం చేస్తోంది కమలదళం.

READ ALSO : Adilabad Lok Sabha Constituency : రాజకీయాలకు అడ్డాగా కుమ్రం భీమ్ పోరుగడ్డ… అదిలాబాద్ పై కన్నేసిన కమలం

RAJASING, AKBAR

RAJASING, AKBAR

ఆరు అసెంబ్లీ స్ధానాలు ఎంఐఎం పార్టీ చేతుల్లోనే..గోషామహల్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా రాజాసింగ్‌

హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో.. మలక్‌పేట, కార్వాన్‌, గోషామహల్‌, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, యాకత్‌పురా, బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ్. ఇందులో ఆరు స్థానాలు ఎంఐఎం ఖాతాలో ఉండగా.. గోషామహల్‌ బీజేపీ చేతిలో ఉంది. గోషామహల్‌లో బీజేపీ నుంచి గెలిచిన రాజాసింగ్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉంటే.. చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఓవైసీ, మలక్‌పేటలో అహ్మద్ బిన్ అబ్దుల్లా బ‌లాల‌.. నాంపల్లిలో జాఫ‌ర్ ముస్సేన్.. కార్వాన్‌లో కౌస‌ర్ మొహియుద్దీన్.. చార్మినార్‌లో ముంతాజ్ అమ్మద్ ఖాన్.. యాకత్‌పురాలో పాషా ఖాద్రి.. బహదూర్‌పురాలో మొజంఖాన్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎంఐఎం తరఫున వాళ్లే మళ్లీ బరిలో దిగడం ఖాయం. ఒకప్పుడు కార్వాన్, మ‌హ‌రాజ్‌గంజ్‌లో బీజేపీకి మంచి పట్టు ఉండేది. కార్వాన్‌లో 1985 నుంచి 1994 వ‌ర‌కు… వ‌రుస‌గా మూసార్లు బీజేపీ తరఫున బద్దం బాల్‌రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. నేడు గోషామహల్‌గా మారిన నాటి మ‌హ‌రాజ్‌గంజ్‌ బీజేపీ, కాంగ్రెస్‌ రెండేసారి సార్లు విజయం సాధించాయ్. బీజేపీ నుంచి రామ‌స్వామి, ప్రేమ్‌సింగ్ రాథోడ్ గెలవ‌గా… రెండుసార్లు మాజీమంత్రి ముఖేష్ గౌడ్ విజ‌యం సాధించారు. గోషామ‌హ‌ల్‌గా మారిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ నుంచి ముఖేష్ గౌడ్ గెలిస్తే… 2014 నుంచి వ‌రుసగా రెండుసార్లు బీజేపీ విజయం సాధించింది. కమలం పార్టీ ఫైర్ బ్రాండ్‌ రాజాసింగ్‌.. గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

మోదీ హవాతో దేశవ్యాప్తంగా విస్తరిస్తోన్న బీజేపీ….80:20 ఫార్ములాతో ముందుకెళ్తున్న బీజేపీ

హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎం పార్టీకి ఎదురులేకుండా పోయింది. లోక్‌సభ పరిధి అంతా పాతబస్తీ ఏరియా కావడం.. రాజ‌కీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయడం.. ఎంఐఎంకు కలిసి వచ్చింది. దీంతో బలంగా విస్తరించింది. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మారుతున్నాయ్. దీంతో అందరి చూపు హైద‌రాబాద్ వైపే కనిపిస్తోంది. ఒక‌వైపు మోదీ హవాతో దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరిస్తోంది. అలాంటి మోదీ.. తెలంగాణను నెక్ట్స్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. దీంతో హైదరాబాద్‌ పొలిటికల్‌ పిక్చర్‌ హాట్‌హాట్‌గా మారింది. 80, 20 ఫార్ములాతో ముందుకెళ్తున్న బీజేపీ.. హైదరాబాద్‌ పార్లమెంట్ స్థానాన్ని ప్రత్యేకంగా తీసుకోనుందనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశ రాజ‌కీయాల్లోనూ హైద‌రాబాద్ పార్లమెంట్ వైబ్రేషన్ క్రియేట్ చేయడం ఖాయం.

READ ALSO : Bhuvanagiri Lok Sabha Constituency : భువనగిరిపై బిజెపి కన్ను… పట్టు సాధించేందుకు కాంగ్రెస్ స్ట్రాటజీలు… వ్యూహాల్లో నిమగ్నమైన గులాబీ పార్టీ

రాజాసింగ్‌ను ఎంపీ బరిలో దింపే ఆలోచన…అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లపై కమలనాథుల కన్ను

వాయిస్ 5 : హైదరాబాద్‌ లోక్‌సభతో పాటు.. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లపై కమలనాథులు కన్నేశారు. ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న రాజాసింగ్‌ను ఈసారి బీజేపీ తరఫున హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని కమలం పార్టీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో తెలంగాణలో హిందూ ఓట్ పోలరైజేషన్‌ చేయొచ్చన్నది కమలం పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. రాజాసింగ్ కాకపోతే.. టైగర్ నరేంద్ర కుమారుడు జితేందర్‌, మాజీ డిప్యూటి మేయ‌ర్ సుభాచంద‌ర్, మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌లో ఒకరిని బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయ్. భాగ్యన‌గర్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత్‌రావును బరిలో దింపే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది బీజేపీ. దీంతోపాటు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీల‌పై కూడా బీజేపీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. లోకసభ స్థానంపై రాజాసింగ్‌ ఆసక్తి చూపించకపోతే.. మరోసారి గోషామహ‌ల్ నుంచే ఆయన బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయ్. జాతీయ మైనారిటీ కమిషన్‌ మెంబ‌ర్ ష‌హ‌జాది చాంద్రయణగుట్ట నుంచి అక్బరుద్దీన్‌పై పోటీకి సిద్ధం అవుతున్నారు. వీరితో పాటు.. యాక్టివ్‌గా ఉండే యువనాయకత్వాన్ని అసెంబ్లీ బరిలో దింపాలని బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. ఎంఐఎంకు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే సందేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

CONGRESS

CONGRESS

ఏడు నియోజకవర్గాలపై సీరియస్‌గానే దృష్టిసారించింన కాంగ్రెస్…బరిలోకి దిగే అభ్యర్ధులు సిద్ధం

హైదరాబాద్ పార్లమెంట్‌తో పాటు.. లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలపై కాంగ్రెస్ కూడా సీరియస్‌గానే దృష్టిసారించింది. ఓట్లు పోలరైజ్ అయి బీజేపీ గెలువకుండా ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. హైద‌రాబాద్ లోక్‌సభకు ఫిరోజ్‌ఖాన్ లేదా సోయల్‌ను బరిలోకి దింపే ఆలోచన చేస్తోంది గోషామహల్‌లో మెట్టు సాయికుమార్.. మలక్‌పేటలో శ్రీనివాస్‌.. చార్మినార్ నుంచి ముజిబుల్లా షేక్ లేదా వెంకటేష్.. బహదూర్‌పురాలో ఖలీముద్దీన్ బాబా.. కార్వాన్‌లో ఉస్మాన్ అల్ హజరీ.. చాంద్రాయణగుట్టలో ఈసా మిస్రీ.. యాకత్‌పురా నుంచి రాజేంద్ర రాజు.. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

READ ALSO : Chevella Lok Sabha Constituency : చెమట్లు పట్టిస్తోన్న చేవెళ్ల పార్లమెంట్ రాజకీయం…ట్రయాంగిల్‌ ఫైట్‌ తప్పదా ?

పాతబస్తీ రాజ‌కీయాలకు దూరంగా గులాబీ పార్టీ….50 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమౌతున్న ఎంఐఎం

తెలంగాణ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్ దోస్తీ పార్టీగా సాగుతున్న ఎంఐఎం… ఈసారి కొత్త జ‌ర్నీకి సిద్ధం అవుతుందనే చర్చ సాగుతోంది. అసెంబ్లీ వేదిక అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు దీనికి బ‌లం చేకూర్చుతున్నాయ్. తెలంగాణవ్యాప్తంగా 50 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం సిద్ధం అవుతుందని తెలుస్తోంది. అదే జరిగితే.. బీఆర్ఎస్‌తో బంధానికి బ్రేక్ పడినట్లే ! ఇన్నాళ్లు జిల్లాల్లో బీఆర్ఎస్‌ గెలుపునకు ఎంఐఎం ప‌నిచేస్తే…. పాతబస్తీలో రాజ‌కీయంగా వేలు పెట్టకుండా గులాబీ పార్టీ సహకరించింది. దీంతో టీఆర్ఎస్‌, ఎంఐఎం రాజ‌కీయ బంధం బ‌ల‌ప‌డింది. ఇప్పుడు ఎంఐఎం ఫార్ములా 50తో ముందుకెళ్తే.. బీఆర్ఎస్‌ కూడా పాతబస్తీ పాలిటిక్స్‌ను సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే.. హైద‌రాబాద్ పార్లమెంట్‌తో పాటు.. ఏడు అసెంబ్లీల్లోనూ బీఆర్ఎస్‌ తన అభ్యర్థులను దింపడం ఖాయం. ఇది రాజకీయంగా ఎంఐఎంకు సవాల్‌గా మారడం కూడా ఖాయం.

kcr brs

kcr brs

హైద‌రాబాద్ సంస్కృతి సంప్రదాయాలపై కేసీఆర్‌కు పట్టు…సంక్షేమ కార్యక్రమాలతో మైనారిటీలకు చేరువ

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ డైరెక్ట్‌గా రాజకీయాలు మొదలుపెడితే.. గ‌తంలో అధికార పార్టీల కంటే ఎక్కువ ప్రభావం చూప‌నుంద‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో టాక్‌. హైద‌రాబాద్ సంస్కృతి సంప్రదాయాల గురించి కేసీఆర్‌కు బాగా తెలుసు. తన మార్క్ ఉర్దూ పటిమతో ముస్లీం ఓటర్లను ఆకట్టుగోగలరు. షాదీముబారక్‌, రంజాన్ తోఫాలతో పాటు.. పలు సంక్షేమ కార్యక్రమాలతో మైనారిటీలకు కేసీఆర్‌ ద‌గ్గర‌య్యార‌ని… అలాంటిది డైరెక్ట్‌గా పొలిటికల్ ఫైట్‌లోకి దిగితే.. పాతబస్తీలో ఎంఐఎం దూకుడు బ్రేకులు ఖాయం అనే చర్చ కూడా ఉంది. అదే జరిగితే హైద‌రాబాద్‌లో తిరుగులేని రాజ‌కీయ శక్తిగా ఉన్న ఎంఐఎం దూకుడుకు కొంత బ్రేక్ పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఐతే ఓవైపు బీజేపీ.. మరోవైపు బీఆర్ఎస్‌.. ఇంకోవైపు కాంగ్రెస్‌.. పాత‌బస్తీపై ముప్పేట దాడికి దిగితే.. అది తమకే కలిసి వస్తుందని ఎంఐఎం పార్టీ భావిస్తోంది.

నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్‌ పార్లమెంట్‌ను రాజ‌కీయంగా తిరుగులేని అడ్డాగా మార్చుకున్న ఎంఐఎంకు … బ్రేకులు వేయాల‌ని బీజేపీ త‌హ‌త‌హలాడుతోంది. చార్మినార్‌పై కాషాయ జెండా ఎగురవేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఐతే అటు కాంగ్రెస్‌ పూర్వవైభవాన్ని కొంతైనా సాధించాలని కలలు కంటోంది. ఫార్ములా 50తో ఎంఐఎం వెళ్తే.. పాతబస్తీలో బీఆర్ఎస్‌ రాజకీయాలను షురూ చేసేందుకు సిద్ధం అవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా హైదరాబాద్ పార్లమెంట్ రాజకీయ ఆసక్తిని రేపుతోంది.