Metro Train Technical Problem : సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో రైలు

హైదరాబాద్ మెట్రో రైలును సాంకేతిక సమస్యలు వీడటం లేదు. టెక్నికల్ సమస్యతో మెట్రో రైలు నిలిచిపోయింది. మెట్రో రైలును సిబ్బంది ఎర్రమంజిల్ స్టేషన్ లో ఆపేసి ప్రయాణికులను దింపేశారు.

Metro Train Technical Problem : సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో రైలు

Metro train

Updated On : January 23, 2023 / 9:31 AM IST

Metro Train Technical Problem : హైదరాబాద్ మెట్రో రైలును సాంకేతిక సమస్యలు వీడటం లేదు. టెక్నికల్ సమస్యతో మెట్రో రైలు నిలిచిపోయింది. ఎల్ బీ నగర్ వెళ్తున్న మెట్రో రైలు మొరాయించడంతో నిలిపివేశారు. మెట్రో రైలును సిబ్బంది ఎర్రమంజిల్ స్టేషన్ లో ఆపేసి ప్రయాణికులను దింపేశారు. ప్రయాణికులను మరో రైలులో తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎల్ బీనగర్ వెళ్తున్న రైలు నిలిచిపోవడంతో వెనుక వస్తున్న రైళ్లకు ఆలస్యం అవుతుంది. అన్ని స్టేషన్లలో భారీ రద్దీ ఉంది. రైళ్లు ఆలస్యంగా నడవటం, ఆఫీస్ లకు వెళ్లే సమయంలో కావడంతో ఇబ్బందులు తలెత్తాయి. సాంకేతిక సమస్య తలెత్తిన రైలును పాకెట్ ట్రాక్ పై నిలిపి సాంకేతిక సమస్యను క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా పలుమార్లు మెట్రో రైలులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.