Monkeypox: ఖమ్మంలో మంకీపాక్స్ కలకలం.. లక్షణాలున్న వ్యక్తిని హైదరాబాద్ తరలింపు

ఖమ్మంలో మంకీపాక్స్ కలకలం సృష్టించింది. మంకీపాక్స్ లక్షణాలున్న ఓ వ్యక్తిని వైద్యులు గుర్తించారు. అతన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు.

Monkeypox: ఖమ్మంలో మంకీపాక్స్ కలకలం.. లక్షణాలున్న వ్యక్తిని హైదరాబాద్ తరలింపు

Monkeypox (1)

Monkeypox: మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 16వేలకుపైగా మంకీపాక్స్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంతో ఈ వైరస్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. దేశంలోనూ మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో మూడు, ఢిల్లీలో ఒక మంకీపాక్స్ కేసు నిర్ధారణ అయింది. తెలంగాణలో మంకీపాక్స్ ఆనవాళ్లు లేనప్పటికీ.. తాజాగా ఖమ్మం జిల్లాలో మంకీపాక్స్ లక్షణాలున్న వ్యక్తిని వైద్యాధికారులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు.

Monkeypox: హమ్మయ్య నెగిటివ్ వచ్చింది.. కామారెడ్డి యువకుడికి మంకీపాక్స్ లేదు..

ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంకు చెందిన వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. కాగా అతను మూడు రోజుల నుంచి అనారోగ్యానికి గురికావడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహిచి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు భావించి ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఆస్పత్రి వైద్యులు పరీక్షించి మంకీపాక్స్ లక్షణాలున్నట్లు గుర్తించారు.

Monkeypox: ఢిల్లీ, కేరళ ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్

ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రత్యేక వార్డులో మంకీపాక్స్ లక్షణాలున్న వ్యక్తిని ఉంచి చికిత్స అందిస్తున్నారు. రక్త నమూనాలను మంకీపాక్స్ నిర్ధారణ కోసం ఫుణెలోని ల్యాబ్ కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలాఉంటే మంకీపాక్స్ లక్షణాలున్నట్లు భావించి ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న కామారెడ్డి జిల్లా వ్యక్తి కి మంకీపాక్స్ నెగిటివ్ నిర్ధారణ అయింది. దీంతో స్థానిక ప్రజలు, వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.