Monkeypox: హమ్మయ్య నెగిటివ్ వచ్చింది.. కామారెడ్డి యువకుడికి మంకీపాక్స్ లేదు..

కువైట్ నుంచి కామారెడ్డికి వ‌చ్చిన యువ‌కుడికి మంకీపాక్స్ నెగెటివ్‌గా నిర్ధార‌ణ అయింది. పుణెలోని ఎన్ఐవీ ల్యాబ్‌లో బాధిత యువ‌కుడి న‌మూనాల‌ను ప‌రీక్షించ‌గా నెగెటివ్ అని తేలింది.

Monkeypox: హమ్మయ్య నెగిటివ్ వచ్చింది.. కామారెడ్డి యువకుడికి మంకీపాక్స్ లేదు..

Monkey Pox

Monkeypox: ప్రపంచ దేశాలను మంకీపాక్స్ వైరస్ వణికిస్తోంది. రోజురోజుకు ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 16వేలకుపైగా ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో మంకీపాక్స్ ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇదిలాఉంటే దేశంలోనూ మంకీపాక్స్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కేరళ రాష్ట్రంలో ముగ్గురికి మంకీపాక్స్ నిర్ధారణ కాగా, ఢిల్లీలో ఒకరికి నిర్ధారణ అయింది. తెలంగాణ రాష్ట్రంలోనూ మంకీపాక్స్ కలకలం రేగింది.

Kamareddy Monkeypox : కామారెడ్డిలో మంకీపాక్స్ టెన్షన్.. ఇందిరానగర్ కాలనీలో హైఅలర్ట్

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా కాలనీకి చెందిన ఓ వ్యక్తి కొన్ని రోజుల క్రితమే కువైట్ నుంచి రావటం, అతనిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అతడిని వైద్యులు హైదరాబాద్ పీవర్స్ ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వార్డులో చికిత్స అందించారు. అతడి శాంపిల్స్ ను సేకరించి పుణెలోని ఎన్ఐవి వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ లో పరీక్షల అనంతరం కామారెడ్డి వ్యక్తికి మంకీపాక్స్ సోకలేదని తేల్చారు. మంకీపాక్స్ నెగిటివ్ వచ్చిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. ఇదిలాఉంటే బాధితుడితో కాంటాక్ట్‌ అయిన మరో ఆరుగురిని కూడా గుర్తించారు. వారిలో ఎలాంటి ఎలాంటి లక్షణాలు లేవు. అయినప్పటికీ వారిని కూడా ఐసోలేషన్‌లో ఉంచారు.

Monkeypox : మంకీపాక్స్‌పై కేంద్రం అలర్ట్..కరోనా తరహాలోనే జాగ్రత్తలు పాటించాలి

ఇదిలాఉంటే దేశవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జరనల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంకీపాక్స్ నివారణకు, ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న సమయంలో మరో కొత్త వ్యాధి వెలుగుచూస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది.