Kamareddy Monkeypox : కామారెడ్డిలో మంకీపాక్స్ టెన్షన్.. ఇందిరానగర్ కాలనీలో హైఅలర్ట్

కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడటం కలకలం రేపింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు బయటపడిన వ్యక్తి నివసించిన ఇందిరానగర్ కాలనీలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు.(Kamareddy Monkeypox)

Kamareddy Monkeypox : కామారెడ్డిలో మంకీపాక్స్ టెన్షన్.. ఇందిరానగర్ కాలనీలో హైఅలర్ట్

Kamareddy Monkeypox

Kamareddy Monkeypox : కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడటం కలకలం రేపింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు బయటపడిన వ్యక్తి నివసించిన ఇందిరానగర్ కాలనీలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. అతడితో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న 8మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

మరోవైపు మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తి హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రత్యేక వార్డులో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. అతడి నుంచి 5 రకాల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పుణెలోని వైరాలజీ ల్యాబ్ కి పంపారు. త్వరలోనే మెడికల్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

Monkeypox: కామారెడ్డి మంకీపాక్స్ కేసు.. హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స

ఈ నెల 6న కువైట్ నుంచి వచ్చిన ఇందిరానగర్ కాలనీ వాసిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. 20న జ్వరం వచ్చింది. 23 నాటికి ఒళ్లంతా ర్యాషెస్ రావడంతో కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. ఆ వ్యక్తిని పరిశీలించిన డాక్టర్లు.. మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో ఫీవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.(Kamareddy Monkeypox)

కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడక ముందే ఇప్పుడు మరో వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలను మంకీపాక్స్‌ వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే 68 దేశాల్లో 16వేల 593 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లోనూ మంకీపాక్స్ అలజడి రేపుతోంది. భారత్ లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 4 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. కేరళలో మూడు కేసులు నమోదు కాగా.. ఢిల్లీలో ఒక కేసు నమోదైంది. మంకీపాక్స్ వైరస్‌కు మందు లేదని.. చర్మంపై పూయడానికి లోషన్లు, మల్టీ విటమిన్లు ఇస్తున్నామని డాక్టర్లు చెప్పారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం… మంకీపాక్స్ అనేది వైరస్‌తో సంక్రమించే అరుదైన వ్యాధి. మంకీపాక్స్ వైరస్ పోక్స్విరిడే కుటుంబానికి చెందిన ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినది. ఆర్థోపాక్స్ వైరస్ జాతిలో వేరియోలా వైరస్, వ్యాక్సినియా వైరస్ మరియు కౌపాక్స్ వైరస్ కూడా ఉన్నాయి. సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ ప్రివెన్షన్ ప్రకారం.. మనుషుల్లో మంకీపాక్స్ లక్షణాలు దాదాపుగా చికెన్‌పాక్స్ మాదిరిగానే ఉంటాయి. అయితే అదనంగా జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు మరియు అలసటగా ఉంటుంది.

Monkeypox: “కొవిడ్ మాదిరిగానే జాగ్రత్తలు పాటించండి”

మంకీపాక్స్ లక్షణాలు:
ఓ వ్యక్తికి మంకీపాక్స్‌ వైరస్ సోకితే 7 నుంచి 14 రోజుల తర్వాత లక్షణాలు ప్రారంభమవుతాయి. జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట మరియు వాపు మంకీపాక్స్‌ సాధారణ లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్న వారు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. చికెన్‌పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై బొబ్బలు వస్తాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ లక్షణాలు ఒక్కోసారి 7 నుంచి 21 రోజుల్లో కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. అయితే మైల్డ్ కేసుల్లో ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు. ఇక మంకీపాక్స్ వైరస్ సోకిన వారు చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. చాలా తక్కువ మందికి ఇది ప్రమాదకరంగా మారుతుంది.

కాగా, మంకీపాక్స్ గురించి ప్రజలు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్లు. బాధితుడికి అతి దగ్గరగా ఉన్న వారికి మాత్రమే మంకీపాక్స్‌ సోకేందుకు ఎక్కువగా అవకాశాలున్నాయని తెలిపారు. గాలి ద్వారా మంకీపాక్స్ సోకదన్నారు. పెద్దగా దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొంత మేర రక్షణ ఉండేందుకు ఆస్కారం ఉందని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారి శరీరంపై దద్దుర్లు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. 6 నుంచి 13 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయని డాక్టర్లు వివరించారు.