Monkeypox: కామారెడ్డి మంకీపాక్స్ కేసు.. హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స

తెలంగాణలో మంకీపాక్స్ లక్షణాలున్న కేసు బయటపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాధితుడు హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే అతడి నమూనాలు ల్యాబ్‌కు పంపగా, ఈరోజు ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Monkeypox: కామారెడ్డి మంకీపాక్స్ కేసు.. హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స

Monkeypox (1)

Monkeypox: తెలంగాణలోని కామారెడ్డిలో మంకీపాక్స్ అనుమానిత కేసు బయటపడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాధితుడు హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడికి మెడ, గొంతు, చేయి, ఛాతి మీద పొక్కులు కనిపిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. బాధితుడికి కామారెడ్డిలో పరీక్షలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు.

Crypto Fraud: క్రిప్టోకరెన్సీ పేరుతో మోసం.. నాలుగు లక్షలు పోగొట్టుకున్న యువకుడు

మరో ఐదు రకాల పరీక్షలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. వీటి ఫలితాలు రేపు వచ్చే అవకాశం ఉంది. అయితే మంకీపాక్స్‌కు సంబంధించి అతడి నుంచి శాంపిల్స్ సేకరించి, పూణేలోని ల్యాబ్‌కు ఇప్పటికే పంపారు. దీని ఫలితం ఈ రోజు వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరుగురు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం వారికి ఎలాంటి మంకీపాక్స్ లక్షణాలు లేవని అధికారులు చెప్పారు. ఇది తెలంగాణలో బయటపడ్డ మొట్టమొదటి మంకీపాక్స్ లక్షణాలు ఉన్న కేసు కావడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 6న బాధితుడు కువైట్ నుంచి ఇండియా వచ్చాడు. ఈ నెల 20న జ్వరంతో బాధపడుతుండగా, మంకీపాక్స్‌గా అనుమానించి వైద్యులను సంప్రదించాడు.

Pitbull Dog: ఓనర్‌ను చంపిన కుక్క.. అయినా దత్తత తీసుకుంటామంటున్న జంతు ప్రేమికులు

దీంతో కామారెడ్డి వైద్యులు అతడిని హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం అక్కడ అతడిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు బాధితుడిని కలిసిన వారి కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతోంది. సాధారణంగా వైరస్ సోకిన 6-13 రోజుల తర్వాత మంకీపాక్స్ లక్షణాలు బయటపడతాయి. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు జ్వరం వంటి లక్షణాలు ఉంటే ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.