Sesame Oil : ఆ నూనెలో ఔషధగుణాలు తెలిస్తే…అసలు వదిలిపెట్టరు!

నువ్వుల నూనెను బాగా వేడి చేసి పక్కన పెట్టి నాల్గవ వంతు కర్పూరం కలిపి మూతపెట్టి చల్లారిన తర్వాత ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజూ రాత్రి ఒకసారి అరికాళ్లకు మర్దన చేస్తుంటే చక్కటి నిద్ర పడుతుంది.

Sesame Oil : ఆ నూనెలో ఔషధగుణాలు తెలిస్తే…అసలు వదిలిపెట్టరు!

Sesame Oil

Sesame Oil : నువ్వుల నూనెల ఆరోగ్యానికి ఎంతో మంచిది. హిందూ సాంప్రదాయంలో ఈ నూనెను ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేవుని పూజలకు ఈ నూనెను ఉపయోగిస్తారు. పూజా కార్యక్రమాలకే కాదు ఈ నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఆయుర్వేద వైద్యంలో నువ్వుల నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. 100 గ్రాముల తెల్ల నువ్వులలో 1000 మి.గ్రా కాల్షియం లభిస్తుంది. నువ్వులు, బాదం కన్నా 6 రెట్లు ఎక్కువ కాల్షియం కలిగి ఉంటాయి. నలుపు మరియు ఎరుపు నువ్వులు ఇనుముతో సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.

నువ్వుల నూనెలో విటమిన్ – బి మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఇది మీథోనిన్ మరియు ట్రిప్టోఫాన్ అని పిలువబడే రెండు ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంది. నువ్వుల నూనెలో ఉన్న లెసిథిన్ అనే రసాయనం, రక్త నాళాలలో కొలెస్ట్రాల్ ప్రవాహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. నువ్వుల నూనెలో సహజంగా , సీస్మోల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. వంటకు వాడుకునేందుకు మంచి నూనెగా ఆయుర్వేదం సూచిస్తోంది. నువ్వుల నూనెలో భాస్వరం ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

జీవక్రియను పెంచే ఆరోగ్యకరమైన కొవ్వులు నువ్వులో ఉంటాయి. మలబద్దకాన్ని కూడా తొలగిస్తాయి. నువ్వుల నూనెలో ఉండే ట్రిప్టోఫాన్‌ గాఢ నిద్రను కలిగించే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది చర్మం ,జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెథోనిన్ కాలేయానికి మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. నూనెలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ మరియు సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి, గుండె కండరాలు సజావుగా పనిచేయడానికి సహాయపడతాయి. గుండె సక్రమంగా కొట్టుకోవడానికి దోహదం చేస్తాయి. ఈ నువ్వుల నూనెలో మోనో- అసంతృప్త కొవ్వు ఆమ్లం ఉంటుంది, ఇది మంచి కొలెస్ట్రాల్‌ను అందించటం ద్వారా శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

నువ్వులు ప్రోటీన్ మరియు అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. శిశువుల ఎముకలను బలాన్ని కలిగిస్తుంది. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది, నువ్వులు సెసామిన్ అనే యాంటీఆక్సిడెంట్ కలిగివుంటాయి. గుండె జబ్బులు, గుండెపోటు అవకాశాలను తగ్గిస్తుంది. పక్షవాతం వంటి వ్యాధులను కూడా నయం చేసే సామర్థ్యం దీనికి ఉంది. నువ్వుల నూనెలో విటమిన్ A మరియు విటమిన్ E సమృద్ధిగా ఉంటాయి. నూనెను వేడి చేసి చర్మంపై మసాజ్ చేయడం వల్ల చర్మము నిగారింపు పొందుతుంది. జుట్టు మీద పూస్తే వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి. కీళ్ల నొప్పులు ఉంటే నువ్వుల నూనెలో కొద్దిగా శొంఠి పొడి, చిటికెడు ఇంగువ పౌడర్ వేసి వేడి చేసి మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు మృదువుగా ఉండాలన్నా, చుండ్రు మాయం కావాలన్నా నువ్వుల నూనె మంచిదని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. బోలు ఎముకల వ్యాధి అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రభావాలను తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, ఇందులో నియాసిన్ అనే విటమిన్ ఉంటుంది. ఇది ఒత్తిడి తగ్గించడంలో సహాయ పడుతుంది.

నువ్వుల నూనెను బాగా వేడి చేసి పక్కన పెట్టి నాల్గవ వంతు కర్పూరం కలిపి మూతపెట్టి చల్లారిన తర్వాత ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజూ రాత్రి ఒకసారి అరికాళ్లకు మర్దన చేస్తుంటే చక్కటి నిద్ర పడుతుంది. రోజూ రాత్రి ఇలా చేసుకుంటే చాలా మంచిది.