Kiara Advani: ఆ ‘బ్లాక్ శారీ’లో మెరిసెందెవరు? సిద్ధార్థ్-కియారా బారాత్ వీడియోలో కనిపించిన మహిళ కోసం నెటిజెన్ల ఆరా

సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వాని పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ వాటిని షేర్ చేస్తూ, కొత్త జంటకు అభినందనలు చెబుతున్నారు. ఈ పెళ్లికి హాజరైన అతిథులు, సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నారు.

Kiara Advani: ఆ ‘బ్లాక్ శారీ’లో మెరిసెందెవరు? సిద్ధార్థ్-కియారా బారాత్ వీడియోలో కనిపించిన మహిళ కోసం నెటిజెన్ల ఆరా

Kiara Advani: స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వాని పెళ్లి వేడుక ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లితోపాటు ఏర్పాటు చేసిన రిసెప్షన్స్ కూడా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Renu Desai: అనారోగ్యంపై సంచలన ప్రకటన చేసిన రేణూ దేశాయ్.. సోషల్ మీడియాలో వెల్లడించిన నటి

ఫ్యాన్స్ వాటిని షేర్ చేస్తూ, కొత్త జంటకు అభినందనలు చెబుతున్నారు. ఈ పెళ్లికి హాజరైన అతిథులు, సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నారు. తాజాగా పెళ్లి వేడుకల్లోని ఒక వీడియోకు సంబంధించి ఆసక్తికర అంశం ట్రెండ్ అవుతోంది. కియారా-సిద్ధార్థ్ పెళ్లి వేడుక సందర్భంగా బారాత్ నిర్వహించారు. దీనికి బోలెడంత మంది అతిథులు హాజరయ్యారు. తమదైన డాన్సులతో అలరించారు. అయితే, ఈ బారాత్‌లో ఒక మహిళ చేసిన డాన్స్ వీడియో మాత్రం నెటిజన్లును విపరీతంగా ఆకర్షిస్తోంది. సిద్ధార్థ్ నటించిన చిత్రం ‘బార్ బార్ దేఖో’ చిత్రంలోని ‘కాలా ఛష్మా’ పాటకు ఆ మహిళ డాన్స్ చేసింది.

Naveen Chandra: తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో.. బేబీ మూన్ అంటూ ట్వీట్!

నల్ల చీర కట్టుకుని ఆమె చేసిన డాన్స్ మూమెంట్స్, ఎనర్జీ నెటిజన్లకు నచ్చేసింది. చాలా మంది ఈ వీడియోను పదేపదే చూస్తున్నారు. బ్లాక్ శారీ కట్టుకున్న ఆ అతిథి కోసం ఈ వీడియోను నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. అయితే, ఈ వీడియోలో ఉన్నది ఎవరో మాత్రం నెటిజన్లు కనిపెట్టలేకపోయారు. దీంతో ఆ బ్లాక్ శారీ కట్టుకున్నది ఎవరూ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమె కోసం తెగ ఆరా తీస్తున్నారు. అయితే, ఆమె వివరాలేవీ నెటిజన్లు కనుక్కోలేకపోయారు. అంతగా నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ వీడియోను మీరూ చూడండి.