Rahul Gandhi: ఎన్డీయే అంటే ‘నో డాటా అవైలబుల్’.. కేంద్రంపై రాహుల్ సెటైర్లు

బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు కొత్త అర్థం చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఎన్డీయే అంటే ‘నో డాటా అవైలబుల్’ అంటూ శనివారం ట్వీట్ చేశారు. ప్రభుత్వం దగ్గర కీలకమైన అంశాలకు సంబంధించిన సమాచారం లేకపోవడంపై విమర్శలు చేశారు.

Rahul Gandhi: ఎన్డీయే అంటే ‘నో డాటా అవైలబుల్’.. కేంద్రంపై రాహుల్ సెటైర్లు

Rahul Gandhi on Nationwide protest

Rahul Gandhi: వివిధ అంశాలపై డాటా అందుబాటులో లేదంటూ కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పకుండా తప్పించుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఎన్డీయే అంటే నో డాటా అవైలబుల్ అంటూ కొత్త అర్థం చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌లో బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Woman Gang-Raped: ఫంక్షన్ కోసం పిలిచి మహిళపై రైల్వే సిబ్బంది అత్యాచారం

ఇటీవల కోవిడ్ సందర్భంగా వలస కార్మికుల మరణాలు, రైతుల ఆత్మహత్య, నిరసనలు వంటి అంశాలకు సంబంధించిన సమాచారం తమ వద్ద లేదంటూ కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. దీని వల్ల ప్రభుత్వం జవాబుదారీ తనం నుంచి తప్పించుకోవాలని చూస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేతోపాటు, రాహుల్ గాంధీ ట్వీట్లు చేశారు. రాహుల్ చేసిన ట్వీట్‌లో ‘‘ఎన్డీయే అంటే నో డాటా అవైలబుల్.. ఆక్సిజన్ కొరత వల్ల ఒక్కరు కూడా మరణించలేదు. నిరసనల్లో ఒక్క రైతూ ప్రాణాలు కోల్పోలేదు.

Rajashthan: అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆత్మహత్యాయత్నం.. ఉద్యమకారుడి మృతి

కరోనా సమయంలో నడుస్తూ ఒక్క వలస కార్మికుడు కూడా చనిపోలేదు. దేశంలో ఒక్కరిపై కూడా మూకదాడులు జరగలేదు. ఒక్క జర్నలిస్టు కూడా అరెస్టు కాలేదు. ప్రభుత్వం వద్ద సమాచారం లేదు.. సమాధానం లేదు.. జవాబుదారీ తనం లేదు’’ అంటూ ప్రభుత్వ తీరును విమర్శించారు. ఇవన్నీ నిజాలని ప్రభుత్వం నమ్మించాలనుకుంటోంది అని రాహుల్ ట్వీట్ చేశారు.