Rajashthan: అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆత్మహత్యాయత్నం.. ఉద్యమకారుడి మృతి

అక్రమ మైనింగ్ నిలిపివేయాలని కోరుతూ 500 రోజులుగా ఉద్యమం చేసిన వ్యక్తి ఆత్మహత్యకు యత్నించి, ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. బాధితుడి మృతిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.

Rajashthan: అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆత్మహత్యాయత్నం.. ఉద్యమకారుడి మృతి

Rajasthan

Rajashthan: రాజస్థాన్‌లో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడిన ఒక వ్యక్తి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాదాపు 500 రోజుల ఉద్యమం తర్వాత ఆత్మాహుతికి యత్నించగా, చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బ్రజ్ ప్రాంతంలో జరిగింది. విజయ్ దాస్ అలియాస్ విజయ్ బాబా అనే వ్యక్తి రాజస్థాన్‌లో అక్రమంగా సాగుతున్న మైనింగ్ నిలిపివేయాలని కోరుతూ 500 రోజులుగా ఉద్యమం చేస్తున్నాడు.

Woman Gang-Raped: ఫంక్షన్ కోసం పిలిచి మహిళపై రైల్వే సిబ్బంది అత్యాచారం

ధర్నాలు, నిరసనలతో తన ఉద్యమం సాగించాడు. అయితే, ఇంత కాలంగా ఉద్యమం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో 501వ రోజైన గురువారం ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే గమనించిన స్థానికులు మంటలు ఆర్పేశారు. అప్పటికే అతడి శరీరం దాదాపు 80 శాతం కాలిపోయింది. గాయాలపాలైన విజయ్ దాస్‌ను వెంటనే జైపూర్‌లోని ఆసుపత్రికి, అక్కడ్నుంచి న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ ఘటన రాజస్థాన్‌లో సంచలనం రేపుతోంది.

Sravana Bhargavi : శ్రావణభార్గవిపై తిరుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. వీడియో తొలగించాలని అన్నమయ్య వంశస్థుల డిమాండ్..

అధికార కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్లే బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ప్రభుత్వం అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని బీజేపీ విమర్శించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.