Ind Vs SA : కేప్‌టౌన్ టెస్టులో భారత్ ఓటమి.. సిరీస్ సౌతాఫ్రికా వశం

డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన డిసైడర్ మ్యాచ్‌లో టీమిండియాపై 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది.

Ind Vs SA : కేప్‌టౌన్ టెస్టులో భారత్ ఓటమి.. సిరీస్ సౌతాఫ్రికా వశం

South Africa Beat India

Ind Vs SA : డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన డిసైడర్ మ్యాచ్‌లో టీమిండియాపై 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ ను 1-2 తేడాతో భారత్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా విజయంలో కీగన్‌ పీటర్సన్‌-82, కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్-30‌, లుంగి ఎంగిడి, కగిసో రబాడ కీ రోల్ ప్లే చేశారు.

ఓవర్‌నైట్‌ స్కోరు 101/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యాన్ని ఛేదించింది. మరో వికెట్‌ మాత్రమే నష్టపోయి ఎంతో ఈజీగా టార్గెట్ (212) ఫినిష్ చేసింది. కీగన్ పీటర్సన్‌ (82 పరుగులు.. 113 బంతుల్లో 10×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. డీన్‌ ఎల్గర్‌ (30) పరుగులు చేసి ఔటయ్యాడు. వాండర్ డస్సెన్ (41*), తెంబా బవుమా (32*) మిగతా పని పూర్తి చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, మహమ్మద్‌ షమి, శార్దూల్ ఠాకూర్‌ తలో వికెట్ పడగొట్టారు.

Ginger Tea : అల్లం టీ ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తప్పవా?

తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 13 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 198 పరుగులకు ఆలౌటైంది. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (100.. 139 బంతుల్లో 6×4, 4×6) వీరోచిత సెంచరీ చేశాడు. అయితే, మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (29) ఫర్వాలేదనిపించాడు. కేఎల్‌ రాహుల్ (10), మయాంక్‌ అగర్వాల్ (7), పుజారా (9), అజింక్య రహానె (1) విఫలమయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. దక్షిణాఫ్రికా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ని ఛేదించింది.

Omicron – Cyber attack: బీ కేర్ ఫుల్.. ఒమిక్రాన్‌నూ వదలని సైబర్ చీటర్లు.. క్లిక్ చేస్తే మొత్తం దోచేస్తారు..!

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 223 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (79: 201 బంతుల్లో 12×4, 1×6), ఛెతేశ్వర్ పుజారా (43: 77 బంతుల్లో 7×4) మినహా మిగతా బ్యాటలెవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ నాలుగు, మార్కో జాన్సన్‌ మూడు, లుంగి ఎంగిడి, కేశవ్‌ మహరాజ్‌, అలివీర్ తలో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌ లో దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు 210 పరుగులకే ఆలౌట్ చేశారు. బుమ్రా ఐదు వికెట్ల తీయగా.. ఉమేశ్‌ యాదవ్‌, మహమ్మద్‌ షమి తలో రెండు వికెట్లు తీశారు. శార్దూల్ ఠాకూర్‌ ఒక వికెట్‌ తీశాడు. ఈ ఓటమితో.. సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలకున్న భారత జట్టు కల నెరవరలేదు.

స్కోర్లు..
భారత్ – 223, 198
సౌతాఫ్రికా – 210, 212/3