COVID-19: కొనసాగుతున్న కరోనా ఉధృతి.. 20 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,409 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది మరణించారు. నాలుగు రోజుల క్రితం వరకు 15 వేలకు చేరిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

COVID-19: కొనసాగుతున్న కరోనా ఉధృతి.. 20 వేలు దాటిన కరోనా కేసులు

Covid 19

COVID-19: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,409 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది మరణించారు. అంతకుముందు రోజు 20,557 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,39,79,730. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,33,09,484. కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,26,258. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,988. యాక్టివ్ కేసుల శాతం 0.33 కాగా రికవరీ రేటు 98.48 శాతం.

Mass Hysteria: అరుపులు.. ఏడుపులు.. స్కూల్లో విచిత్రంగా ప్రవర్తించిన అమ్మాయిలు… అసలేమైంది?

డైలీ పాజిటివిటీ రేటు 5.12 శాతంగా ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 4.82 శాతంగా ఉంది. మరణాల శాతం 1.20. దేశంలో ఇప్పటివరకు 203.60 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 87.44 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించారు. గడచిన 24 గంటల్లో 38.6 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. 24 గంటల వ్యవధిలో 22 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీ అవుతున్న కేసులే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో ఉచిత బూస్టర్ డోసు పంపిణీ కొనసాగుతోంది.