Indian Navy ‘INS Mormugao’ : భారత నేవీలోకి మరో భారీ యుద్ధనౌక..మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా నౌకాదళంలో ప్రవేశం..

భారత నేవీలోకి మరో భీకర భారీ యుద్ధనౌక చేరింది. మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా నౌకాదళంలో ప్రవేశించింది ‘INS Mormugao’ నౌక.

Indian Navy ‘INS Mormugao’ : భారత నేవీలోకి మరో భారీ యుద్ధనౌక..మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా నౌకాదళంలో ప్రవేశం..

Indian Navy ‘INS Mormugao’ 

Indian Navy ‘INS Mormugao’  : భారత రక్షణ రంగం అంతకంతకు బలమైన శక్తిగా రూపుదిద్దుకుంటోంది. భారీ అస్త్రశస్త్రాలతో శతృదేశాలకు సవాల్ విసురుతోంది. రక్షణరంగంపై భారీగా ఖర్చు చేస్తున్న భారత్ త్రివిధ దళాల్లోనూ అత్యంత శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. దీంట్లో భాగంగా తాజాగా అగ్ని-5 క్షిపణి సరిహద్దుల్లో తోక జాడిస్తున్న డ్రాగన్ దేశానికి సవాల్ విసురుతోంది. ఈక్రమంలోనే భారత నావికాదళంలోకి మరో భారీ విధ్వంసక నౌక వచ్చి చేరింది. అదే ద గ్రేట్ ‘ఐఎన్ఎస్ మోర్ముగావో’(INS Mormugao). ఈ యుద్ద నౌక నావికా దళంలోకి చేరటంతో భారత నావికారంగం మరింత బలోపేతమైంది.

స్వదేశీయంగా నిర్మించిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్ఎస్ మోర్ముగావో’ ఆదివారం (డిసెంబర్ 18,2022) నౌకాదళంలో అడుగుపెట్టింది. ‘విశాఖపట్టణం’ క్లాస్ డిస్ట్రాయర్‌లో రెండవదైన ఈ భారీ నౌకను ఆదివారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ..స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి అత్యాధునిక యుద్ధనౌక INS మోర్ముగో ఒక ప్రధాన ఉదాహరణ అని అన్నారు. ఈ నౌక భారతదేశం స్థానికంగా కాకుండా ప్రపంచ నౌకా నిర్మాణ అవసరాలను తీర్చగలదని ధీమా వ్యక్తంచేశారు.

నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసిన ఈ నౌక (INS Mormugao) నాలుగు శక్తిమంతమైన గ్యాస్ టర్బైన్లతో నడిచే ఈ నౌక గంటకు 30 నాట్ల (55 కిలోమీటర్లు)కు పైగా వేగంతో ప్రయాణించగలదు. మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. ఈ నౌకలో వినియోగించిన పరికరాలు..టెక్నాలజీ మూడు వంతులు స్వదేశీయంగా తయారైనవే కావటం విశేషం. ధునాతన సెన్సార్లు, ఆయుధాలు కలిగి ఉన్న ఈ నౌకకు నిఘా రాడార్ వ్యవస్థ కూడా ఉంది. సముద్రం ఉపరితలం నుంచి గగన లక్ష్యాలపై క్షిపణులను సంధించగల శక్తి ఈ నౌక సొంతం. అంతేకాదు అణు, జీవ రసాయన యుద్ధ పరిస్థితుల్లో కూడా పోరాడగలిగేలా ఈ ‘ఐఎన్ఎస్ మోర్ముగావో (INS Mormugao)ను తీర్చి దిద్దారు.

Indian Navy ‘INS Mormugao’