Corona India : భారత్ లో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 2,68,833 పాజిటివ్ కేసులు

భారత్ లో రోజువారీ పాజిటివిటి రేటు 16.66 శాతానికి చేరింది. దేశంలో యాక్టీవ్ కేసులు 3.85 శాతానికి చేరుకున్నాయి. దేశంలో ఇప్పటివరకు 3,68,50,962 కేసులు, 4,85,752 మరణాలు నమోదు అయ్యాయి.

Corona India : భారత్ లో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 2,68,833 పాజిటివ్ కేసులు

Corona (6) 11zon

India new corona cases : భారత్ లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకూ భారీగా కేసులు పెరుగుతున్నాయి. రోజువారి కేసుల సంఖ్య రెండు లక్షలకు పైగా ఉంటుంది. దేశంలో కొత్తగా 2,68,833 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 402 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,17,820 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

భారత్ లో రోజువారీ పాజిటివిటి రేటు 16.66 శాతానికి చేరింది. దేశంలో యాక్టీవ్ కేసులు 3.85 శాతానికి చేరుకున్నాయి. దేశంలో ఇప్పటివరకు 3,68,50,962 కేసులు, 4,85,752 మరణాలు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి 3,49,47,390 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 6041 కి చేరింది.

New Uniform : ఇండియన్ ఆర్మీకి కొత్త యూనిఫామ్

నిన్న ఒక్కరోజే దేశంలో కొత్తగా 2,64,202 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ బారిన పడి 315 మంది మరణించారు. గత 24 గంటల్లో 1,09,345 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరోవైపు భారత్ లో 364 రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 73,08,669 డోసుల టీకాలు అందజేశారు. ఇప్పటివరకు 155.39 కోట్ల డోసుల టీకాలు అందజేశారు.