India Corona : భారత్ లో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 3,33,533 పాజిటివ్ కేసులు, 525 మంది మృతి

దేశంలో ప్రస్తుతం 21,87,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడి 4,89,409 మంది మరణించారు.

India Corona : భారత్ లో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 3,33,533 పాజిటివ్ కేసులు, 525 మంది మృతి

India Covid

India new corona cases and deaths : భారత్ లో కరోనా మళ్లీ కలవరం రేపుతోంది. దేశంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కొత్తగా 3,33,533 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 525 మంది చనిపోయారు. దేశంలో ప్రస్తుతం 21,87,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడి 4,89,409 మంది మరణించారు.

దేశంలో కరోనా వైరస్ థర్డ్‌వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10వేలు దాటింది. కొత్త వేరియంట్ కేసులు అన్ని రాష్ట్రాల్లోనూ కలిపి 10వేల50 నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే 3.29శాతం పెరిగాయి. అయితే ముందురోజుతో పోలిస్తే మాత్రం గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ఒక్కరోజులో 3లక్షల37వేల కేసులు నమోదయ్యాయి. మొన్న 3లక్షల 88వేల కేసులు నమోదయ్యాయి.

Covid‌ Cases : తెలుగు రాష్ట్రాలపై కరోనా పడగ.. తిరుపతి ఐఐటీ క్యాంపస్‌ లో 100కుపైగా పాజిటివ్ కేసులు

పాజిటివిటీ రేటు ముందురోజు 17.94శాతంగా ఉంటే నిన్న కాస్త తగ్గింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 17.22శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 5.43శాతంగా ఉంది. థర్డ్‌వేవ్‌లో కరోనా రికవరీ రేటు తగ్గుతూ వస్తోంది. ఒక్కరోజులో 93.31శాతానికి పడిపోయింది. గడచిన 24 గంటల్లో 488 మంది కరోనా బారిన పడి చనిపోయారు. థర్డ్‌వేవ్‌లో ఒక్కరోజులో ఇన్ని కరోనా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి.

మరోవైపు కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను కొనసాగిస్తున్నాయి. తమిళనాడు రేపు వీకెండ్‌ లాక్‌డౌన్ ప్రకటించింది. ఎయిర్‌పోర్టుకు, రైల్వేస్టేషన్‌కు వెళ్లే ఆటోలు, ట్యాక్సీలను అనుమతిస్తోంది. తమిళనాడులో ఒక్కరోజు 28వేల 561 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నాటక వీకెండ్ కర్ఫ్యూని ఎత్తివేసి, నైట్ కర్ఫ్యూని కొనసాగిస్తోంది. ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది.