Corona Vaccine : అన్ని కరోనా వేరియంట్లకు ఒకే వ్యాక్సిన్..! ఇండియన్ సైంటిస్టుల ఘనత

ఇండియన్ సైంటిస్టులు శుభవార్త చెప్పారు. కరోనావైరస్ అన్ని వేరియంట్లను నిలువరించే వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నట్లు తెలిపారు.

Corona Vaccine : అన్ని కరోనా వేరియంట్లకు ఒకే వ్యాక్సిన్..! ఇండియన్ సైంటిస్టుల ఘనత

Corona Vaccine

Corona Vaccine : ఇండియన్ సైంటిస్టులు శుభవార్త చెప్పారు. కరోనావైరస్ అన్ని వేరియంట్లను నిలువరించే వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. అభిస్ కొవాక్ (AbhiSCoVac) టీకాను అభివృద్ధి చేసేందుకు తాము కొత్త పద్ధతి (కంప్యూటేషనల్ మెథడ్స్) అనుసరిస్తున్నట్లు నజ్రుల్ యూనివర్సిటీ, ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ పద్ధతిని జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ లిక్విడ్స్ ప్రచురించేందుకు అంగీకరించిందన్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు.

కాగా, కరోనా కట్టడికి పలు కంపెనీల వ్యాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ సహా ఇప్పటిదాకా 9 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 రెండు డోసుల టీకాలే. రీసెంట్ గా.. డీసీజీఐ నుంచి అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన స్పుత్నిక్ లైట్ మాత్రం సింగిల్ డోస్ వ్యాక్సిన్.

Chilli : మిరప కారం అధికంగా తింటే… వృద్ధాప్య ఛాయలు

కరోనా మహమ్మారి కట్టడికి అత్యంత శక్తివంతమైన ఆయుధం వ్యాక్సిన్ అని నిపుణులు సూచిస్తున్నారు. కోవిడ్ నియంత్ర‌ణ‌కు వ్యాక్సినేష‌న్ ప్రక్రియ వేగ‌వంతం చేయ‌డం ఒక్కటే మార్గం అని నిపుణులు తేల్చారు. ఎంత వేగంగా వ్యాక్సినేష‌న్ పూర్త‌యితే అంత త‌ర్వ‌గా క‌రోనా తీవ్ర‌త‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌ని స్పష్టం చేశారు.

గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కొత్త కొత్త రూపాల్లో విరుచుకుపడుతోంది. కరోనా కారణంగా భారీగానే పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం థర్డ్‌వేవ్‌ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా అనేక చర్యలు చేపట్టడంతో మహమ్మారి అదుపులోకి వచ్చింది. వ్యాక్సిన్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి.

WhatsApp Alert : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!

ఇక థర్డ్‌వేవ్‌ తగ్గుముఖంపై ఐసీఎంఆర్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. మార్చి ప్రారంభం నాటికి థర్డ్‌వేవ్‌ తగ్గుముఖం పడుతుందని తెలిపింది. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ్ బెంగాల్‌లో థర్డ్ వేవ్ ఫిబ్రవరి చివరి నాటికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఐసీఎంఆర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సమీరన్ పాండా తెలిపారు. ఈ నెలాఖరు నాటికి కోవిడ్‌ కేసులు సాధారణ స్థితికి చేరుకుంటాయన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని.. వచ్చే మూడు, నాలుగు వారాల్లో దేశంలో థర్డ్‌వేవ్‌ ముగింపు దశకు చేరుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.