Covid Deaths: ఇండియాలో 2.5లక్షలకు చేరిన కొవిడ్ సెకండ్ వేవ్ మృతులు

 ఇండియాలో సెకండ్ వేవ్ ప్రభావానికి 2.5లక్షల మందికి పైగా చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే దాదాపు లక్ష మందికి పైగా చనిపోయినట్లు సమాచారం.

Covid Deaths: ఇండియాలో 2.5లక్షలకు చేరిన కొవిడ్ సెకండ్ వేవ్ మృతులు

Covid Death

Covid Deaths: ఇండియాలో సెకండ్ వేవ్ ప్రభావానికి 2.5లక్షల మందికి పైగా చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే దాదాపు లక్ష మందికి పైగా చనిపోయినట్లు సమాచారం. సెకండ్ వేవ్ కారణంగా మంగళవారం రాత్రి నాటికి 2.54లక్షలకు మించిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. మార్చి 1నుంచి వేవ్ ప్రారంభమైనట్లు లెక్కిస్తే.. ముందు వేవ్ కంటే 1.57లక్షలు ఎక్కువ రికార్డ్ అయ్యాయట. మొత్తం ఇండియాలో 4లక్షల 11వేల 435మృతులు సంభవించాయి.

సెకండ్ వేవ్ సమయంలో పలు రాష్ట్రాల్లో కొవిడ్ మృతుల లెక్కలు పరిగణనలోకి రాకుండానేపోయాయి. కేసులు నమోదుకాకుండా ఉన్నప్పటికీ కొవిడ్ మృతుల సంఖ్య గతం కంటే ఎక్కువగానే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజులోనే మధ్యప్రదేశ్ కొవిడ్ మృతుల సంఖ్య వెయ్యి 481. పది రోజులుగా ఈ సంఖ్య 9వేల 733గా ఉంది.

మంగళవారం ఇండియాలో నమోదైన కొత్త కేసులు 39వేల వరకూ ఉంటే అంతకుముందు రోజు 30వేల 557మాత్రమే ఉన్నాయి. మంగళవారం కరోనా మృతులు 624గా ఉండగా అంతకంటే ముందు రోజు 446 ఉన్నాయి.

కేరళలో తాజా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 14వేల 539మంది ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. మహారాష్ట్రలో 7వేల 243కొత్త కేసులు నమోదు కాగా జూన్ 28తర్వాత అత్యల్పంగా నమోదైనట్లు రికార్డ్ నమెదైంది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య దేశం మొత్తంలో నమోదైన కేసుల్లో 55శాతంగా ఉంది.

మహారాష్ట్రలో 196 కొవిడ్ మృతులు, కేరళలో 124మృతులతో మునుపెన్నడూ లేనన్ని కరోనా మరణాలు నమోదవుతున్నాయి.