Infinix Cheapest 5G Phone : భారత్‌లో అత్యంత చౌకైన ధరకే ఇన్‌ఫినిక్స్‌ 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. స్టాక్ ఉండగానే కొనుక్కోండి!

Infinix Cheapest 5G Phone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫినిక్స్‌ (Infinix) భారత మార్కెట్లో రెండు కొత్త సరసమైన స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. Infinix Hot 20 Play, Hot 20 5G వంటి కొత్త ఫోన్‌లతో హాట్ 20 సిరీస్‌ను అధికారికంగా ప్రవేశపెట్టింది.

Infinix Cheapest 5G Phone : భారత్‌లో అత్యంత చౌకైన ధరకే ఇన్‌ఫినిక్స్‌ 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. స్టాక్ ఉండగానే కొనుక్కోండి!

Infinix launches cheapest phone with 5G support in India, price set below Rs 12,000

Infinix Cheapest 5G Phone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫినిక్స్‌ (Infinix) భారత మార్కెట్లో రెండు కొత్త సరసమైన స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. Infinix Hot 20 Play, Hot 20 5G వంటి కొత్త ఫోన్‌లతో హాట్ 20 సిరీస్‌ను అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చాయి. వాస్తవానికి హాట్ 20 5G అనేది సెగ్మెంట్‌లో 5G సపోర్ట్‌తో వచ్చిన మొదటి ఫోన్. కొత్త హాట్ 20 సిరీస్ ప్లేటర్‌కి కొత్తదనాన్ని అందిస్తోంది. కొత్త సిరీస్‌లో LED ఫ్లాష్-సెల్ఫీ కెమెరాలు, భారీ బ్యాటరీ సామర్థ్యంతో 18W టైప్-C క్విక్ ఛార్జింగ్‌ సపోర్టు అందిస్తుంది. ​​HOT 20 5G ప్రైమరీ కెమెరాలో డ్యూయల్ LED ఫ్లాష్, HOT 20 Play ప్రైమరీ కెమెరాలో క్వాడ్-LED ఫ్లాష్ ఉన్నాయి.

Infinix launches cheapest phone with 5G support in India, price set below Rs 12,000

Infinix launches cheapest phone with 5G support in Indiaఇన్‌ఫినిక్స్‌

దీనిపై Infinix ఇండియా CEO అనీష్ కపూర్ మాట్లాడుతూ.. Infinix 5G సపోర్టుతో వచ్చిన HOT సిరీస్ అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. అనేక FIST ఫీచర్‌లతో సుపీరియర్ డిస్‌ప్లే, హై-ఎండ్ పర్ఫార్మెన్స్, యూజర్ ఫ్రెండ్లీ ధరలతో మార్కెట్లోకి వచ్చింది. HOT 20 Play, HOT 20 5G రెండు స్మార్ట్ ఫోన్లు వినియోగదారులను మరింత ఆకర్షించేలా గేమింగ్ టెక్నాలజీ ఎక్స్ పీరియన్స్ అందించనున్నాయని కపూర్ తెలిపారు.

Read Also : Moto X40 Series : మోటోరోలా నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ X40 5G సిరీస్ ఫోన్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Infinix 5G : ధర ఎంతంటే? :
Infinix Hot 20 Play, HOT 20 5G రెండు స్మార్ట్‌ఫోన్లు రూ. 8999, రూ. 11999 ధరలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు గరిష్టంగా 7GB RAM (4GB RAMతో 3GB మెమరీ), 64GB స్టోరేజీతో అందుబాటులో ఉన్నాయి. HOT 20 Play మూడు అద్భుతమైన లూనా బ్లూ, అరోరా గ్రీన్, రేసింగ్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లలో వచ్చింది. అయితే HOT 20 5G స్పేస్ బ్లూ, బ్లాస్టర్ గ్రీన్, రేసింగ్ బ్లాక్‌లలో అందుబాటులో ఉంటుంది.

Infinix launches cheapest phone with 5G support in India, price set below Rs 12,000

Infinix launches cheapest phone with 5G support in India

Infinix Hot 20 Play, Hot 20 5G : స్పెసిఫికేషన్‌లు ఇవే :
Infinix Hot 20 Play 90 Hz రిఫ్రెష్ రేట్ & 120 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.82-అంగుళాల HD+ పంచ్ హోల్ ఫ్లూయిడ్ గేమింగ్ డిస్‌ప్లేతో వచ్చింది. మరోవైపు Hot 20 5G, మరోవైపు HOT 20 5G 6.6-అంగుళాల FHD+ హైపర్‌విజన్ గేమింగ్ డిస్‌ప్లేతో మొదటి-ఇన్-సెగ్మెంట్ 120Hz అల్ట్రా-హై రిఫ్రెష్ రేట్, 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. హాట్ 20 ప్లే ఆక్టా కోర్ G37 గేమింగ్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. హాట్ 20 5G 6nm డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : JioMart On Whatsapp Chat : జియోమార్ట్ యూజర్లకు గుడ్‌ న్యూస్.. ఇకపై నేరుగా వాట్సాప్ చాట్‌లోనే షాపింగ్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!