PM Modi-CM KCR : ప్రధాని మోదీ పర్యటనలో సీఎం కేసీఆర్‌‌కు ఆహ్వానం .. గులాబీ బాస్ పాల్గొంటారా? లేదా?

ప్రధాని మోదీ పర్యటనలో సీఎం కేసీఆర్‌‌కు ఆహ్వానం.. ప్రధాని సభలో గులాబీ బాస్ మాట్లాడటానికి పీఎంవో సమయం కేటాయించింది. మరి సీఎం కేసీఆర్ ఈ సభలో పాల్గొంటారా?లేదా?

PM Modi-CM KCR : ప్రధాని మోదీ పర్యటనలో సీఎం కేసీఆర్‌‌కు ఆహ్వానం .. గులాబీ బాస్ పాల్గొంటారా? లేదా?

PM Modi-CM KCR

PM Modi-CM KCR : ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. దీనికి సంబంధించిన వివరాలను సీఎంవో విడుదల చేసింది. సికింద్రాబాద్ పర్యటనలో పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ ఏర్పాటు చేసే సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడేందుకు టైమ్ కేటాయించింది పీఎంవో. అయితే ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో 10వ తగరతి ప్రశ్నాపత్రం లీకేజ్ విషయంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ కావటంతో అసలే ఉప్పు, నిప్పుగా ఉండే బీజేపీ, బీఆర్ఎస్ ఈ ఘటనతో మరింత దూరంగా పెరిగిందనే చెప్పాలి. నిన్న (మార్చి5,2023)న బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 10వ తగరతి ప్రశ్నాపత్రం లీకేజ్ పై విచారించనున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో సభవేదికను పంచుకునే విషయంలో ఉత్కంఠ నెలకొంది.

బీజేపీకి, బీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఫుల్ ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ ఫామ్ హౌస్ ప్లాన్ లో బీజేపీ కుట్ర ఉందంటూ ఆరోపించటం..ఈకేసు విషయంలోనే కాకుండా తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయింపులు, ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందంటూ ఈడీవిచారణలు ఇలా పలు అంశాలపై బీజేపీకి బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిణామాలు కొసాగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 10వ తగరతి ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో బీజేపీ నేతల హస్తం ఉందంటూ నోటీసులు జారీ..రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయటం వంటివి కొనసాగుతున్న క్రమంలో ప్రధాని మీటింగ్ లో గులాబీ బాస్ పాల్గొంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

PM Modi: 8న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ .. షెడ్యూల్ ఇలా..

కాగా ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చినా సీఎం కేసీఆర్ ఆహ్వానించటానికి వెళ్లకపోవటం పలు మార్లు జరిగింది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించటంలేదంటూ బీజేపీ విమర్శలు సంధిస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో అధికారం కోసం బీజేపీ పక్కాగా ప్లాన్లు వేయటం సీఎం కేసీఆర్ ను గద్దె దింపుతాం అంటూ బీజేపీ నేతల విమర్శలు ఇలా పలు అంశాలపై బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర విమర్శలు, ఆరోపణలు వంటివి కొనసాగుతున్న క్రమంలో ప్రధాని సికింద్రాబాద్ పర్యటనలో జరుగనున్న పరేండ్ గ్రౌండ్ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడేందుకు పీఎంవో సమయం కేటాయించటం అనేది ఆసక్తికరంగా మారింది. మరి సీఎం కేసీఆర్ ఈ సభకు వస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.

కాగా..ప్రధాని నరేంద్ర మోదీ 8న హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ లో ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా.. మోదీ సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభిస్తారు. పరేడ్ గ్రౌండ్ చేరుకొని అక్కడ వివిధ ప్రారంభోత్సవాలు, ప్రాజెక్టులు జాతికి అంకితం చేస్తారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించి తిరుగు పయణం అవుతారు.