iPhone 12 mini Sale : ఐఫోన్ 12 మినీపై భారీ తగ్గింపు.. ఫ్లిప్‌‍‌కార్ట్‌లోనే.. ఎంతంటే?

ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఐఫోన్లపై భారీ తగ్గింపుతో సేల్ ఆఫర్ చేస్తోంది.

iPhone 12 mini Sale : ఐఫోన్ 12 మినీపై భారీ తగ్గింపు.. ఫ్లిప్‌‍‌కార్ట్‌లోనే.. ఎంతంటే?

Iphone 12 Mini In Flipkart

iPhone 12 mini Sale : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఐఫోన్లపై భారీ తగ్గింపుతో సేల్ ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే పలు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర రిటైల్ స్టోర్‌లు ఐఫోన్‌లపై తగ్గింపు ఆఫర్లు అందిస్తున్నాయి. ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లోని ఐఫోన్ 12 మినీ (iPhone 12 mini) ధర రూ. 28,000 సొంతం చేసుకోవచ్చు. ఈ ధరకే ఖరీదైన iPhone 12mini ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 12 మినీ, 64GB వేరియంట్‌ ధర రూ. 59,900 ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 41,999కే సొంతం చేసుకోవచ్చు. UPI పేమెంట్స్ ద్వారా రూ. 200 వరకు తగ్గింపుతో సిటీ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపుతో పొందవచ్చు. లేదంటే.. మీ పాత ఫోన్‌ ఇచ్చి iPhone 12 మినీపై అతిపెద్ద తగ్గింపు ధరకే పొందవచ్చు.

Flipkart సేల్‌లో భాగంగా మీ పాత ఫోన్‌కి బదులుగా రూ. 15,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీ ఫోన్ బాగా పనిచేస్తుంటే.. రూ. 15,000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత ఫోన్ అది ఏడాదిలో కొన్నారు.. మీ వద్ద బాక్స్, ఒరిజినల్ ఛార్జర్, ఇయర్‌ఫోన్‌లు వంటి ఇతర అప్లియన్సెస్ ఆధారంగా డిస్కౌంట్ పొందవచ్చు.

iPhone 11 లేదా iPhone XR వంటి పాత ఫోన్‌ల ద్వారా అధిక డిస్కౌంట్ పొందవచ్చు. Samsung, Vivo, Xiaomi లేదా Realme ఫోన్‌లపై ఎక్స్ఛేంజ్ ద్వారా తక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. iPhone 12 mini 2020లో మార్కెట్లోకి వచ్చింది. iPhone 12 లైనప్‌లో ఇదే అతి చిన్న ఫోన్ గా చెప్పవచ్చు. ఐఫోన్ 12 మినీ 5.4 అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లేతో వచ్చింది.

నెక్స్ట్-జనరేషన్ న్యూరల్ ఇంజన్ ప్రాసెసర్‌తో A14 బయోనిక్ చిప్‌తో వచ్చింది. 64GB స్టోరేజ్‌తో వచ్చిన ఈ ఐఫోన్ 12 మినీలో నైట్ మోడ్, 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్, ఫ్రంట్ సైడ్ 12MP కెమెరాతో సహా వివిధ మోడ్‌లతో డ్యూయల్-12-MP కెమెరా ఉంది. వాటర్ రిసిస్టెన్స్ IP68గా రేట్ అయింది. ఐఫోన్ 12 మినీ ఫోన్ బ్లాక్, రెడ్, ఆరెంజ్, ఆకుపచ్చ, తెలుపు సహా ఆరు కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

Read Also : Mohan Babu-Lakshmi Manchu: తండ్రీ-కుమార్తె ప్రధాన పాత్రల్లో మూవీ ప్రారంభం!