IPL 2021 RR Vs PBKS : వాట్ ఏ మ్యాచ్.. ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ పై రాజస్తాన్ ఘన విజయం

ఐపీఎల్ 2021 సీజన్ 2లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన్ ఈ మ్యాచ్ లో రాజస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది. 2 పరుగుల తేడాతో

IPL 2021 RR Vs PBKS : వాట్ ఏ మ్యాచ్.. ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ పై రాజస్తాన్ ఘన విజయం

Ipl 2021 Rr Vs Pbks

IPL 2021 RR Vs PBKS : ఐపీఎల్ 2021 సీజన్ 2లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన్ ఈ మ్యాచ్ లో రాజస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది. 2 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. అద్భుతమైన బౌలింగ్ తో రాజస్తాన్ విజయాన్ని నమోదు చేసింది. చేజారిందనుకున్న మ్యాచ్ ని అద్భుతంగా కమ్ బ్యాక్ చేసి గెలిచింది.

Covaxin Kids : త్వరలోనే చిన్నారులకు కొవాగ్జిన్.. భారత్ బయోటెక్ గుడ్ న్యూస్

కచ్చితంగా గెలుస్తుందని అనుకున్న పంజాబ్ జట్టు ఆఖరి ఓవర్ లో చతికిలపడింది. విజయానికి మూడు పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అద్భుత పోరాటం వృథా అయ్యింది. రాహుల్ ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. మయాంక్ అగర్వాల్ (67) హాఫ్ సెంచరీతో రాణించాడు. 186 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్.. 20ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 183 పరుగులు మాత్రమే చేసింది.

పంజాబ్ జట్టుకి 15 బంతుల్లో 10 పరుగులు కావాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. దీంతో పంజాబ్ గెలుపు ఖాయం అని అంతా అనుకున్నారు. కట్ చేస్తే.. రాజస్తాన్ బౌలర్ కార్తిక్ త్యాగి ఆఖరి ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆఖరి ఓవర్ లో 4 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. అయితే త్యాగి కేవలం ఒక రన్ మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసి రాజస్తాన్ గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో బరిలో దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఎవిన్ లూయీస్ (36), యశస్వి జైస్వాల్ (49) పటిష్ఠమైన ఆరంభాన్నిచ్చారు. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ (4) నిరాశపరిచినా లియామ్ లివింగ్‌స్టన్ (25)కు తోడు మహిపాల్ లోమ్రార్ (43) ఇరగదీశాడు. కేవలం 17 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి చివరకు అర్షదీప్ బౌలింగ్‌లో మార్క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Credit, Debit కార్డుదారులకు అలర్ట్… అక్టోబ‌ర్ 1 నుంచి కొత్త రూల్స్

మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. రాహుల్ తెవాటియా (2), రియాన్ పరాగ్ (4), క్రిస్ మోరిస్ (5), చేతన్ సకారియా (7), కార్తిక్ త్యాగి (1) పరుగులు చేశారు. మొత్తం 20 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. పంజాబ్ ముందు పటిష్ఠ లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ బౌలర్లలో యువ పేసర్ అర్షదీప్ సింగ్ 5 వికెట్లతో సత్తా చాటాడు. మహమ్మద్ షమీ తన ఖాతాలో మూడు వికెట్లు వేసుకున్నాడు. ఇషాన్ పోరెల్, హర్‌ప్రీత్ బ్రార్ చెరో వికెట్ తీసుకున్నారు.