IPL 2023, LSG vs SRH: IPL 2023 : హైదరాబాద్‌కు వరుసగా రెండో ఓటమి

ఈ సీజన్ లో హైదరాబాద్ తీరు మారలేదు. వరుసగా రెండో ఓటమి చవిచూసింది.

IPL 2023, LSG vs SRH: IPL 2023 : హైదరాబాద్‌కు వరుసగా రెండో ఓటమి

Lucknow Super Giants vs Sunrisers Hyderabad

IPL 2023, LSG vs SRH: ఐపీఎల్ 2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ సీజన్ లో హైదరాబాద్ తీరు మారలేదు. వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ పై లక్నో జట్టు గెలుపొందింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 07 Apr 2023 10:50 PM (IST)

    మళ్లీ ఓడిన హైదరాబాద్‌

    ఈ సీజన్ లో హైదరాబాద్ తీరు మారలేదు. వరుసగా రెండో ఓటమి చవిచూసింది. హైదరాబాద్ పై లక్నో జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 122 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు.. 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.

  • 07 Apr 2023 10:44 PM (IST)

    15ఓవర్లకు లక్నో స్కోర్ 118/5

    15 ఓవర్లకు లక్నో జట్టు 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. విజయానికి మరో 4 పరుగుల దూరంలో ఉంది.

  • 07 Apr 2023 10:41 PM (IST)

    వెంట వెంటనే వికెట్లు డౌన్

    114 పరుగుల జట్టు స్కోర్ వద్ద లక్నో జట్టు 5వ వికెట్ కోల్పోయింది. రొమారియో షెప్పర్డ్ డకౌట్ అయ్యాడు. ఈ వికెట్ కూడా అదిల్ రషీద్ కే దక్కింది. అంతకుముందు కెప్టెన్ కేఎల్ రాహుల్(31 బంతుల్లో 35 పరుగులు) రషీద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. రషీద్ ఖాన్ ఔట్

  • 07 Apr 2023 10:39 PM (IST)

    4వ వికెట్ డౌన్

    114 పరుగుల జట్టు స్కోర్ వద్ద లక్నో జట్టు 4వ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(31 బంతుల్లో 35 పరుగులు) రషీద్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

  • 07 Apr 2023 10:29 PM (IST)

    3వ వికెట్ డౌన్

    100 పరుగుల జట్టు స్కోర్ వద్ద లక్నో జట్టు మూడో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా (23 బంతుల్లో 34 పరుగులు) ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

  • 07 Apr 2023 10:27 PM (IST)

    12 ఓవర్లకు లక్నో స్కోర్ 96/2

    12 ఓవర్లకు లక్నో జట్టు రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.

  • 07 Apr 2023 09:47 PM (IST)

    5 ఓవర్లకు లఖ్‌నవూ స్కోరు 39/1

    లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ లక్ష్య ఛేదన ప్రారంభించింది. ఆ జట్టు ఓపెనర్ మేయర్స్ 13 పరుగులకే ఫరూఖీ బౌలింగ్ లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ స్కోరు 39/1 గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్ (18), దీపక్ హూడా (1) ఉన్నారు.

  • 07 Apr 2023 09:07 PM (IST)

    లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టార్గెట్ 122

    లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 122 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లలో అల్మోన్ ప్రీత్ సింగ్ 31, రాహుల్ త్రిపాఠి 34 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బౌలర్లలో కృనాల్ పాండ్యా 3 వికెట్లు తీయగా, అమిత్ మిశ్రా 2, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయి చెరో వికెట్ తీశారు.

  • 07 Apr 2023 09:04 PM (IST)

    ఎనిమిదో వికెట్ కూడా..

    సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఉమ్రాన్ మాలిక్ డకౌట్ అయ్యాడు.

  • 07 Apr 2023 09:02 PM (IST)

    ఏడో వికెట్ డౌన్

    సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ (15) ఔటైన వెంటనే రషీద్ 4 పరుగులకే వెనుదిరిగాడు.

  • 07 Apr 2023 08:58 PM (IST)

    వాషింగ్టన్ సుందర్ ఔట్

    సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ (15) ఔటయ్యాడు.

  • 07 Apr 2023 08:56 PM (IST)

    18 ఓవర్లకు స్కోరు 102/5

    హైదరాబాద్ స్కోరు 102/5 (18 ఓవర్లకు)గా ఉంది. క్రీజులో వాషింగ్టన్ సుందర్ (15), అబ్దుల్ (7) ఉన్నారు.

  • 07 Apr 2023 08:53 PM (IST)

    5 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్

    సన్‌రైజర్స్ హైదరాబాద్ 5వ వికెట్ కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి 34 పరుగులు చేసి ఔటయ్యాడు.

  • 07 Apr 2023 08:15 PM (IST)

    4 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్

    సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ జట్టు స్కోరు 55/4 (9 ఓవర్లకు)గా ఉంది.  అన్మోల్ ప్రీత్ సింగ్ (31), మయాంక్ అగర్వాల్ (8), కెప్టెన్ మార్క్రాం (0) వికెట్లను కృనాల్ పాండ్యా తీశాడు. బ్రూక్ (3) వికెట్ ను రవి బిష్ణోయి పడగొట్టాడు. క్రీజులో రాహుల్ త్రిపాఠి (12), వాషింగ్టన్ సుందర్ (0) ఉన్నారు.

  • 07 Apr 2023 07:59 PM (IST)

    6 ఓవర్లకు 43/1

    సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 6 ఓవర్లకు 43/1గా ఉంది. క్రీజులో అన్మోల్‌ ప్రీత్ సింగ్ (27), రాహుల్ త్రిపాఠి (6) ఉన్నారు.

  • 07 Apr 2023 07:43 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్

    సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 2.4 ఓవర్ వద్ద మయాంక్ అగర్వాల్ (8) కృనాల్ పాండ్యా బౌలింగ్ లో ఔటయ్యాడు. క్రీజులో అన్మోల్‌ ప్రీత్ సింగ్ (13), రాహుల్ త్రిపాఠి (0) ఉన్నారు.

  • 07 Apr 2023 07:35 PM (IST)

    తొలి ఓవర్లో సన్‌రైజర్స్ 5 పరుగులు

    సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులోకి ఓపెనర్లుగా అన్మోల్‌ ప్రీత్ సింగ్, మయాంక్ అగర్వాల్ వచ్చారు. తొలి ఓవర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 పరుగులు చేసింది.

  • 07 Apr 2023 07:18 PM (IST)

    కేఎల్ రాహుల్ సేన

    లఖ్‌నవూ సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హూడా, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్

  • 07 Apr 2023 07:15 PM (IST)

    మార్క్రామ్ సేన

    సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్

  • 07 Apr 2023 07:02 PM (IST)

    సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్

    సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

  • 07 Apr 2023 06:55 PM (IST)

    కాసేపట్లో టాస్

    కాసేపట్లో టాస్ వేయనున్నారు. టాస్ గెలిచే జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.