IPL 2023: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్.. ఈ రికార్డు ఇక ఎప్పుడు బద్ధలవుతుందో..

ఫ్లేఆఫ్స్ లో గతంలోని రికార్డులన్నింటినీ బద్ధలుకొట్టింది ముంబై ఇండియన్స్.

IPL 2023: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్.. ఈ రికార్డు ఇక ఎప్పుడు బద్ధలవుతుందో..

Mumbai Indians

Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో ముంబై ఇండియన్స్ (MI) అరుదైన రికార్డు సాధించింది. చెన్నైలో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు (LSG)ను రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై జట్టు 81 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచులో ఏ బ్యాటరూ హాఫ్ సెంచరీ బాదలేదు. అయినప్పటికీ ముంబై స్కోరు 182/8గా నమోదైంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచు(IPL playoff match)ల చరిత్రలో ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయకుండా జట్టు 180 పరుగులు దాటడం ఇదే మొట్టమొదటిసారి. బుధవారం జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ బ్యాటర్ కామెరూన్ గ్రీన్ 41 పరుగులు చేశాడు.

అదే ఈ మ్యాచులో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2018 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఫైనల్ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 178/6 స్కోరు సాధించింది. అప్పట్లోనూ సన్‌రైజర్స్ జట్టులో ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. కానె విలియమ్సన్ ఆ మ్యాచులో 47 పరుగులు చేశాడు.

అంతకుముందు జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచులోనూ కోల్‌కతా నైట్ రైడర్స్ పై సన్‌రైజర్స్ 174/7 పరుగులు చేసినా, ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. సన్‌రైజర్స్ టీమ్ లో వృద్ధిమాన్ సాహా చేసిన 35 పరుగులే అత్యధిక స్కోరుగా నిలిచింది.

ఐపీఎల్- 2013లో రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స తో తలపడి 165/6 స్కోరు చేసింది. ఆ మ్యాచులోనూ రాజస్థాన్ రాయల్స్ లో ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో రాహుల్ ద్రవిడ్ ఆ మ్యాచులో 43 పరుగులు చేశారు.

ఐపీఎల్-2008లో రాజస్థాన్ రాయల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 163/5 స్కోరు చేసింది. ఆ సమయంలోనూ సురేశ్ రైనా చేసిన 43 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది.

IPL 2023: ఐపీఎల్ మోస్ట్ ఇంప్రెసివ్ ప్లేయర్ అతడే: హర్భజన్ సింగ్