IT Rides: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. మైత్రి మూవీస్, దర్శకుడు సుకుమార్ కార్యాలయాల్లో రైడ్స్
హైదరాబాద్ లోని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాణ సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

IT Rides
IT Rides: హైదరాబాద్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మువీస్ మేకర్స్ సంస్థ కార్యాలయాలు, నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఇళ్లలోనూ, దర్శకుడు సుకుమార్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు రెండు బృందాలుగా విడిపోయి కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.
గతేడాది డిసెంబర్ నెలలోనే మైత్రి మువీస్ కార్యాలయంపై ఐటీ దాడులు జరిగిన విషయం విధితమే. ఆ సమయంలో ఇచ్చిన డాక్యూమెంట్స్ టాలీ కాకపోవటం వల్లనే మళ్లీ ఐటీ అధికారులు మైత్రి మూవీస్ కార్యాలయంపై దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఐటీ దాడుల తరువాత ఇదే బ్యానర్ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు వచ్చాయి. అవి అత్యధిక కలెక్షన్స్ వసూళ్లు చేసినట్లు మువీమేకర్స్ కూడా ప్రకటించడం కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. త్వరలోనే వీరసింహారెడ్డికి సంబంధించి విజయోత్సవ సభను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
Boutique Opening : డిజైనర్ గీతాంజలి బొటిక్ ప్రారంభించిన మంచు లక్ష్మి.. సందడి చేసిన యువ హీరోయిన్స్..
మైత్రి మూమీమేకర్స్తో పాటు డైరెక్టర్ సుకుమార్ కార్యాలయంపైనా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంటి వద్ద, కార్యాలయాల్లో రెండు బృందాలుగా వచ్చి అధికారులు సోదాలు చేస్తున్నారు. సోదారులు జరిపే కార్యాలయాల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఐటీ అధికారులు అందరూ ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులేనని, రెండు బృందాలుగా విడిపోయి సోదాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పుష్ప -2 సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పవన్‌తో ఉస్తాద్ భగత్ సింగ్, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా, రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమాలను మైత్రి మూవీస్ మేకర్ సంస్థ తెరకెక్కిస్తుంది.