Itlu Amma: సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ‘ఇట్లు అమ్మ’ ప్రివ్యూ షో!

మనిషిని ఇంకో మనిషి పట్టించుకోనితనాన్ని ప్రశ్నిస్తున్న సినిమా ఇట్లు అమ్మ. చీమకు కూడా హాని తలపెట్టని కొడుకు తనకు శాశ్వతంగా దూరమైతే ఆ తల్లి పడే తపన కథాంశంగా తెరకెక్కిన సినిమా..

Itlu Amma: సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ‘ఇట్లు అమ్మ’ ప్రివ్యూ షో!

Itlu Amma

Itlu Amma: మనిషిని ఇంకో మనిషి పట్టించుకోనితనాన్ని ప్రశ్నిస్తున్న సినిమా ఇట్లు అమ్మ. చీమకు కూడా హాని తలపెట్టని కొడుకు తనకు శాశ్వతంగా దూరమైతే ఆ తల్లి పడే తపన కథాంశంగా తెరకెక్కిన సినిమా ఇట్లు అమ్మ. జాతీయ, అంతర్జాతీయంగా పెచ్చరిల్లుతున్న హింసతోపాటు, అన్యాయాన్ని ప్రశ్నించినందుకు సత్యాన్నే వధిస్తున్న ఈ సమాజాన్ని ప్రశ్నించే సినిమా ఇటు అమ్మ. సీనియర్ నటులు రేవతి, పోసాని కృష్ణమురళి, రవికాలే తదితరులు నటించిన ఈ సందేశాత్మక సినిమా ఈరోజు(శుక్రవారం) నుంచే సోని లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Annaatthe: సిద్ శ్రీరామ్, శ్రేయ ఘోషల్.. ‘అన్నాత్తై’ నుండి మంచి మెలోడీ

ఈ నేపథ్యంలో ఇట్లు అమ్మ సినిమా ప్రివ్యూ షోను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మాజీ మంత్రి జె గీతారెడ్డి, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, సామాజిక వేత్త సాజయా, మహిళ సంఘ నేతలు దేవి, రచయిత జయరాజ్ తదితరులు ఈ ప్రివ్యూ షోకు హాజరయ్యారు. ‘అంకురం’ సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న సీ ఉమా మహేశ్వరరావు ఈ సినిమాను తెరకెక్కించగా బొమ్మక్ క్రియేషన్స్ పతాకంపై మురళి నిర్మించారు. నాగులపల్లి కనకదుర్గ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

RRR: నిర్మాతల సంప్రదింపులు.. ఆర్ఆర్ఆర్ డేట్ మారుతుందా?

ఈ సినిమా ప్రివ్యూ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు సి ఉమామహేశ్వరరావు.. ప్రపంచ గతిని మార్చే శక్తి అమ్మకు ఉందని.. సమాజంలో జరిగే హింసకు, బేధాలకు ఎక్కువగా ప్రభావితం అయ్యేది స్త్రీ. ముఖ్యంగా అమ్మ. హింస, తేడాలు లేని గొప్ప సంఘాన్ని స్థాపించగల శక్తి మహిళ సొంతం. ఇందుకు తల్లులందురూ ఏకమవ్వాలి అని చెప్పేందుకు ఈ చిత్రాన్ని రూపొందించామని చెప్పారు. నిర్మాత బొమ్మక్ మురళి.. చెడుమార్గంలో పయణిస్తున్న సమాజం తిరిగి సన్మార్గం పట్టేందుకు అమ్మ ముందడుగు వేయాలనే సందేశాన్ని ఈ చిత్రం ప్రేక్షకులకు ఇవ్వబోతోంది. మంచి సమాజాన్ని నిర్మించేందుకు ప్రపంచంలోని అమ్మలంతా ఒక్కటవ్వాలనే పిలుపునిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tamil Stars : అన్ని కోట్లిచ్చి టాలీవుడ్‌కి తెచ్చుకుంటున్నారా?

మాజీ మంత్రి గీతా రెడ్డి మాట్లాడుతూ.. శత్రువైనా మిత్రుడైనా అందరూ అమ్మకు బిడ్డలే అనే గొప్ప సత్యాన్ని ఇట్లు అమ్మ సినిమా చూపిస్తుంది. అమ్మ హృదయం ఎంత గొప్పదో ఈ సినిమా చూస్తే తెలుస్తోంది. ప్రతి అమ్మ, ప్రతి పురుషుడు చూడాల్సిన చిత్రమిదని చెప్పారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా అంటే ఇలాగే ఉంటుంది అనే హద్దులు గీశారు. ఇట్లు అమ్మ సినిమా అవి దాటి తెరకెక్కింది. మన జీవితాలు, మన సమాజం ఈ చిత్రంలో కనిపిస్తుందన్నారు. వుమెన్ యాక్టివిస్ట్ దేవి మాట్లాడుతూ.. ఇవాళ ఎలాంటి ఘోరాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. మగాడు ప్రతి మహిళలో అమ్మను చూసే రోజులు రావాలి. ఈ సినిమా అమ్మంటే ఏంటో చూపించే సినిమా.. నేటి సమాజం చూడాల్సిన సినిమా ఇదన్నారు.