GST Return: ఐటీఆర్, జీఎస్‌టీ రిటర్న్‌కు నేడే ఆఖరి రోజు… కీలకాంశాలివే

సెక్షన్ 139(4) ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం, గడువు దాటిన తర్వాత కూడా ఆదాయపు పన్ను దాఖలు చేయొచ్చు. జూలై 31 తర్వాత ట్యాక్స్ చెల్లించే వాళ్లు రూ.5,000 అపరాధ రుసుముతో ఆదాయపు పన్ను దాఖలు చేయాలి. అదీ రూ.5 లక్షలకంటే ఎక్కువుంటే.

GST Return: ఐటీఆర్, జీఎస్‌టీ రిటర్న్‌కు నేడే ఆఖరి రోజు… కీలకాంశాలివే

GST Return: ఐటీ రిటర్న్, జీఎస్‌టీ రిటర్న్ దాఖలు చేసేందుకు నేడే (డిసెంబర్ 31) ఆఖరి రోజు. 2022-23 సంవత్సరానికి అంచనా లేదా ఇప్పటికే దాఖలు చేసిన ఆదాయ పన్ను వివరాల్లో మార్పులు చేయాలంటే ఈ రోజే చివరి అవకాశం. అలాగే 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ చెల్లింపు దారుల టర్నోవర్ రూ.2 కోట్లు దాటిన వాళ్లు కూడా ఐటీ రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

Maharashtra: బీజేపీ నేతపై షిండే క్యాంపు నేతల దాడి.. షిండే వర్గం, బీజేపీ మధ్య ఇంకా కుదరని సయోధ్య

సెక్షన్ 139(4) ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం, గడువు దాటిన తర్వాత కూడా ఆదాయపు పన్ను దాఖలు చేయొచ్చు. జూలై 31 తర్వాత ట్యాక్స్ చెల్లించే వాళ్లు రూ.5,000 అపరాధ రుసుముతో ఆదాయపు పన్ను దాఖలు చేయాలి. అదీ రూ.5 లక్షలకంటే ఎక్కువుంటే. ఐదు లక్షల రూపాయలకంటే తక్కువ పన్ను చెల్లించే వాళ్లు రూ.1,000 అపరాధ రుసుముతో చెల్లించాలి. సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం ఇలా అపరాధ రుసుముతో చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31లోపు ఐటీ రిటర్న్ దాఖలు చేయని వాళ్లు సెక్షన్ 139(4) ప్రకారం గడువు ముగిసిన తర్వాత ఐటీ దాఖలు చేయాల్సి ఉంటుంది. లేకుంటే ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది. జూలై 31లోపే ఐటీ రిటర్న్ దాఖలు చేసినప్పటికీ, ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని డిసెంబర్ 31లోపు సరి చేసుకోవచ్చు.

Twitter: ఇంటి నుంచే టాయిలెట్ పేపర్స్ తెచ్చుకుంటున్న ట్విట్టర్ స్టాఫ్.. మస్క్ చర్యలతో ఉద్యోగుల తిప్పలు

ఇధి సెక్షన్ 139(5) ఐటీ యాక్ట్ ప్రకార్తం వర్తించే చట్టం. మార్పులతో కూడిన ఐటీ రిటర్న్ మొదటిదానిలాగే చేయాల్సి ఉంటుంది. కానీ, సెక్షన్ 139(5) సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా దాఖలు చేసిన ఐటీ రిటర్న్ పత్రాల్ని కూడా సమర్పించాలి. ఐటీ రిటర్న్‌ దాఖలు చేసిన తర్వాత, వెరిఫికేషన్ వ్యవధిని 120 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు. అంటే, 30 రోజుల లోపు ఐటీ రిటర్న్ వెరిఫికేషన్ చేయకపోతే, వినియోగదారులు దాఖలు చేసిన ఐటీ రిటర్న్ చెల్లదు.