Maharashtra: బీజేపీ నేతపై షిండే క్యాంపు నేతల దాడి.. షిండే వర్గం, బీజేపీ మధ్య ఇంకా కుదరని సయోధ్య

షిండేకు చెందిన శివసేన పార్టీ నేతలు, బీజేపీ నేతపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేతకు తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని థానేలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నగరంలో బ్యానర్లు కట్టే విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య వివాదం తలెత్తింది.

Maharashtra: బీజేపీ నేతపై షిండే క్యాంపు నేతల దాడి.. షిండే వర్గం, బీజేపీ మధ్య ఇంకా కుదరని సయోధ్య

Maharashtra: బీజేపీతో కలిసి శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ రెండు పార్టీల మధ్య ఇంకా సఖ్యత లేనట్లే కనిపిస్తోంది. గతంలో ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న శివసేన, బీజేపీ మధ్య ఇప్పటికీ కొన్నిచోట్ల సమస్యలున్నాయి.

Naresh- Pavithra : ఇక అంతా అఫీషియల్.. లిప్ కిస్‌తో నరేష్-పవిత్రా పెళ్లి ప్రకటన..

తాజాగా షిండేకు చెందిన శివసేన పార్టీ నేతలు, బీజేపీ నేతపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేతకు తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని థానేలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నగరంలో బ్యానర్లు కట్టే విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య వివాదం తలెత్తింది. షిండే వర్గానికి చెదిన శివసేన నేతలకు, బీజేపీ నేతలకు మధ్య గురువారం వాగ్వాదం తలెత్తింది. ఈ సమయంలో ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. అయితే, పోలీసులు జోక్యం చేసుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు. అయితే, మరుసటి రోజు శుక్రవారం ఇదే అంశంపై అటు షిండే వర్గం, బీజేపీ నేత ప్రశాంత్ జాదవ్ మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో దాదాపు 20 మంది షిండే వర్గం నేతలు, బీజేపీ నేతపై దాడి చేశారు.

Twitter: ఇంటి నుంచే టాయిలెట్ పేపర్స్ తెచ్చుకుంటున్న ట్విట్టర్ స్టాఫ్.. మస్క్ చర్యలతో ఉద్యోగుల తిప్పలు

కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రశాంత్ జాదవ్ తలకు గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు షిండే వర్గం నేతలే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. స్థానిక మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటన ఇరు పక్షాల మధ్య మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.