Jagdeep Dhankhar: నేడు ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌‌ఖడ్‌ ప్రమాణ స్వీకారం

భారత నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌‌ఖడ్‌ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతునున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో గురువారం ఉదయం 11:45కి జగదీప్‌ ధన్‌‌ఖడ్‌‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

Jagdeep Dhankhar: నేడు ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌‌ఖడ్‌ ప్రమాణ స్వీకారం

Jagdeep Dhankhar: భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌‌ఖడ్‌ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో గురువారం ఉదయం 11:45కి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ముందు ఆయన రాజ్‌ఘాట్‌లో ఉన్న మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు.

Gurugram Club: క్లబ్బులో మహిళతో బౌన్సర్ల అసభ్య ప్రవర్తన… ప్రశ్నించినందుకు దాడి.. వీడియో వైరల్‌

అక్కడ జగదీప్‌ ధన్‌‌ఖడ్‌‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడుతారు. ఆయన రాజ్యసభ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారు. ఈ నెల 6న జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే తరఫున పోటీ చేసిన జగదీప్‌ ధన్‌‌ఖడ్‌ భారీ మెజారిటితో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 528 ఓట్లతో, 74.36 శాతం శాతం ఓట్లు సాధించారు. జగదీప్‌ ధన్‌‌ఖడ్‌ రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలోని ఒక గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ చదివిన ఆయన కొన్నేళ్లపాటు రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.

Toronto International Film Festival 2022 : టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో రాజమౌళి.. హాలీవుడ్ డైరెక్టర్స్ తో సినీ చర్చలు..

అనంతరం 1989లో లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్ పార్టీ నుంచి ఝుంఝును ఎంపీగా గెలిచారు. తర్వాత 1990లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. అనంతరం 1993లో అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019-2022 జులై 17 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు.