Director TJ Gnanavel: ‘జై భీమ్’ దర్శకుడి కొత్త చిత్రం ‘దోశ కింగ్’ ..! ఓ మహిళ 18ఏళ్ల సుధీర్ఘ పోరాటం ..

తమిళ సినీ దర్శకుడు TJ జ్ఞానవేల్ ‘ జై భీమ్’ చిత్రంతో సంచలన దర్శకుడిగా మారాడు. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రముఖులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందింది. దీంతో జ్ఞానవేల్ తదుపరి సినిమా ఎలా ఉండబోతుంది, ఎలాంటి చిత్రాన్ని తెరకెక్కిస్తారని ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లోనూ చర్చనీయాంశంగా మారింది. తాజాగా జ్ఞానవేల్ జంగ్లీ పిక్చర్స్ బ్యానర్ పై హిందీలో ‘దోస కింగ్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సిద్ధమయ్యారట.

Director TJ Gnanavel: ‘జై భీమ్’ దర్శకుడి కొత్త చిత్రం ‘దోశ కింగ్’ ..! ఓ మహిళ 18ఏళ్ల సుధీర్ఘ పోరాటం ..

Dosa King

Director TJ Gnanavel: తమిళ సినీ దర్శకుడు TJ జ్ఞానవేల్ ‘ జై భీమ్’ చిత్రంతో సంచలన దర్శకుడిగా మారాడు. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రముఖులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందింది. దీంతో జ్ఞానవేల్ తదుపరి సినిమా ఎలా ఉండబోతుంది, ఎలాంటి చిత్రాన్ని తెరకెక్కిస్తారని ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లోనూ చర్చనీయాంశంగా మారింది. తాజాగా జ్ఞానవేల్ జంగ్లీ పిక్చర్స్ బ్యానర్ పై హిందీలో ‘దోస కింగ్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సిద్ధమయ్యారట. ఈ చిత్రం ద్వారా ఓ మహిళ 18ఏళ్లుగా ఓ పారిశ్రామిక వేత్త, సమాజంలో గొప్ప పేరున్న వ్యక్తిపై సుధీర్ఘ పోరాటం సాగించి విజయం సాధించిన తీరును ప్రపంచానికి తెలియజేసేందుకు జ్ఞానవేల్ సిద్ధమయ్యారు.

Jai Bheem : జై భీమ్ సినిమాకి మరో రెండు అవార్డులు..

జ్ఞానవేల్ తెరకెక్కించబోయే కథ ఎవరిదో కాదు.. సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అయిన ఓ వ్యక్తికి ఎదురు తిరిగి ఓ మహిళ చేసిన పోరాటం. జాతకాల పిచ్చితో తన జీవితాన్ని నాశనం చేసుకున్న ఓ పెద్దమనిషి జీవితం. ఆయనే పి. రాజగోపాల్. శరవణ భవన్ చెయిన్ రెస్టారెంట్ల వ్యవస్థాపకుడు. తమిళనాడు ట్యూటికొరిన్ జిల్లాలో ఓ మారుమూల పల్లెల్లో రైతు కుటుంబంలో పుట్టిన రాజగోపాల్.. హోటల్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. ‘దోశ కింగ్’గా పేరుపొందాడు. ఆ తరువాత శరవణ భవన్ పేరిట 22 దేశాల్లో 111 రెస్టారెంట్లను నిర్వహించారు. అయితే అతనికి జాతకాల పిచ్చి. ఓ జ్యోతిష్యుడు చెప్పాడని మూడవ పెళ్లికి సిద్ధమయ్యాడు.

Jai Bheem : దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌లో నాంది, జై భీమ్ సినిమాలకి అవార్డులు..

రాజగోపాల్ వద్ద మేనేజర్ గా పనిచేసే రామసామి చిన్న కూతురు జీవజ్యోతిని పెళ్లాడాలని ప్రయత్నించాడు. అప్పటికే ఆమెకు పెళ్లైంది. రాజగోపాల్ ను పెళ్లిచేసుకొనేందుకు నిరాకరించింది. భర్త ప్రిన్స్ శాంతకుమార్ ను అడ్డు తొలగిస్తే జీవజ్యోతి తనకు లొంగుతుందని మూర్ఖపు ఆలోచనతో 2001లో హత్య చేయించాడు. జీవజ్యోతిని లైంగికంగా వేధించడం, హత్యా నేరారోపణలపై రాజగోపాల్ పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగాడు. 2019లో సుప్రీంకోర్టు జోక్యంతో పోలీసులకు లొంగిపోయిన కొద్ది రోజులకే గుండెపోటుతో మృతి చెందాడు. క్రైమ్ థిల్లర్ ను తలపించే ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ సిద్ధమయ్యారు.

Jai Bheem : ‘జై భీమ్’కు అరుదైన గౌరవం.. గోల్డెన్‌ గ్లోబ్ అవార్డుకు నామినేట్

ఈ విషయంపై జంగ్లీ పిక్చర్స్ సీఈఓ అమృతా పాండే మాట్లాడుతూ.. “దోస కింగ్’’ అనేది ఒక అద్భుతమైన కథ. ఇది పాత్రలు, కథను వివరించేటప్పుడు చాలా శ్రద్ధ అవసరం. జ్ఞానవేల్ దర్శకత్వంలో సరికొత్త కథను తెరకెక్కించేందుకు అతనితో భాగస్వామిగా ఉండటానికి మేము చాలా సంతోషిస్తున్నామని అన్నారు.