Jogu Ramanna: సొంత పార్టీ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే జోగురామన్న ఫైర్.. ఇలాచేస్తే బాగుండదని వార్నింగ్

కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జోగురామన్న డిమాండ్ చేశారు.

Jogu Ramanna: సొంత పార్టీ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే జోగురామన్న ఫైర్.. ఇలాచేస్తే బాగుండదని వార్నింగ్

Kaushik Reddy - Jogu Ramanna

Updated On : June 25, 2023 / 5:33 PM IST

Jogu Ramanna – Kaushik Reddy : బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యే జోగురామన్న ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో జోగురామన్న మీడియాతో మాట్లాడారు. ముదిరాజ్ లపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. కౌశిక్ రెడ్డిని ఆయన హెచ్చరించారు.

కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జోగురామన్న డిమాండ్ చేశారు. వ్యక్తిగతంలో ఓ వ్యక్తిపై ఉన్న ఆగ్రహాన్ని మొత్తం కులంపై చూపించడం సరైంది కాదని అన్నారు. దమ్ముంటే సంబంధిత వ్యక్తిపై మాత్రమే ప్రతాపం చూపాలని చెప్పారు. అంతేగానీ, యావత్ కులాన్ని దూషించడం ఏంటని నిలదీశారు.

కౌశిక్ రెడ్డి తమ పార్టీకి చెందిన నేతే అయినప్పటికీ ఓ బీసీ బిడ్డగా తాను కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని జోగురామన్న తెలిపారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు నష్టం కలిగించేలా ఉన్నాయని చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ను కోరతానని అన్నారు. కౌశిక్ రెడ్డి కేవలం ముదిరాజ్ కులస్తులనే కాకుండా, 55 శాతం ఉన్న బీసీలు అందరినీ అవమానపర్చినట్టేనని చెప్పారు. ఇంకోసారి ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండదని అన్నారు.

YS Sharmila: మళ్లీ బీఆర్ఎస్ దొంగలకే ఈ బాధ్యతలు ఇచ్చారు: వైఎస్ షర్మిల