BJP President JP Nadda: రాహుల్ గాంధీ ‘న్యూ లుక్’పై జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ న్యూ లుక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిర్వహించిన భారత్ జోడో యాత్రలో, యాత్ర అనంతరం కొద్దిరోజుల వరకు రాహుల్ గాంధీ పొడువాటి గడ్డంతో కనిపించాడు. తాజాగా కేంబ్రిడ్జిలో రాహుల్ ప్రసంగ సమయంలో సేవ్ చేసుకొని ’న్యూ లుక్’లో కనిపించారు.

BJP President JP Nadda: రాహుల్ గాంధీ ‘న్యూ లుక్’పై జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు..

JP Nadda

BJP President JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ న్యూ లుక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిర్వహించిన భారత్ జోడో యాత్రలో, యాత్ర అనంతరం కొద్దిరోజుల వరకు రాహుల్ గాంధీ పొడువాటి గడ్డంతో కనిపించాడు. తాజాగా కేంబ్రిడ్జిలో రాహుల్ ప్రసంగ సమయంలో సేవ్ చేసుకొని ’న్యూ లుక్’లో కనిపించారు. అయితే, ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల ఎన్నికల ఫలితాలపై ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడిన జేపీ నడ్డా.. రాహుల్ గాంధీ న్యూ లుక్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ తాజా లుక్స్‌తో రాజకీయం చేసే బ్రాండింగ్ యుగం పోయిందని అన్నారు. ఇప్పుడు అసలు ఏంటో కనిపిస్తోంది. ప్రజలకు సేవ చేయడం ద్వారా పేద ప్రజల మనసులను గెలుచుకొనే అవకాశం ఉంది. కానీ, మన రూపాన్ని మార్చుకున్నంత మాత్రాన రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరు అంటూ జేపీ నడ్డా పేర్కొన్నారు.

JP Nadda: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నద్దా పదవీ కాలం పొడిగింపు.. 2024 లోక్‌సభ ఎన్నికలు నద్దా నాయకత్వంలోనే

కేంబ్రిడ్జ్‌లో రాహుల్ గాంధీ ప్రసంగంపైనా జేపీ నడ్డా స్పందించారు. ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూనే భారత్ ను వ్యతిరేకించడం మొదలుపెట్టారు. నిరసన ఏ స్థాయిలో ఉండాలో వారికి అర్ధంకావడం లేదు. ఏ సమస్యలపై నిరసన వ్యక్తంచేయాలో తెలుసుకోవాలి. సర్జికల్ స్ట్రైక్ పై ప్రశ్నలు వేశారు. వైమానిక దాడులపై ప్రశ్నలు లేవనెత్తారు. నేడు పుల్వామాను ప్రశ్నిస్తున్నారు. అదికూడా విదేశాలకు వెళ్లి. ఇది జాతీయతకు నిదర్శనమా అంటూ నడ్డా ప్రశ్నించారు.

Rahul Gandhi Comments : కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాహుల్ కీలక వ్యాఖ్యలు.. ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం

రాహుల్ గాంధీ ఏదిచేసినా ప్రచారంకోసం చేస్తున్నట్లు కనిపిస్తుందని జేపీ నడ్డా విమర్శించారు. రాహుల్ గాంధీ గుడికి వెళ్లినాకూడా వార్తల్లోకెక్కుతున్నాడు. నేను వెళ్లినప్పుడు ఎందుకు వార్తలురావడం లేదు. ఎందుకంటే.. నేను మొదటినుంచి అంటే తరచూ గుడికి వెళ్తుంటాను. ఇలాంటి విషయాలతో సంబంధం కలిగి ఉన్నాను అంటూ వ్యాఖ్యానించారు. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఈ ఫలితాలు రెండురోజుల్లో వచ్చినవి కావన్నారు. ప్రధాన మంత్రి దూరదృష్టితో కూడిన ఆలోచన, సంకల్పం, కృషితో గొప్ప ఫలితాలు వచ్చాయని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎనిమిది రాష్ట్రాల్లో ఏడు బీజేపీ ప్రభుత్వం హయాంలో ఉన్నాయని తెలిపారు. మోదీ అద్భుత పాలనతో గిరిజన, క్రైస్తవ సంఘాల నుంచి కూడా బీజేపీకి మద్దతు లభిస్తుందని జేపీ నడ్డా తెలిపారు.