Jr NTR: ఇక జాతరే.. ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతున్న తారక్ మూవీ లైనప్

1000 కోట్ల జోష్ తో ట్రిపుల్ ఆర్ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్న యంగ్ టైగర్.. ఫ్యాన్స్ కోసం ఫుల్ గా సర్ ప్రైజెస్ రెడీ చేశారు. ట్రిపుల్ ఆర్ తో మిస్ చేసుకున్న మూవీ లైనప్ ఇప్పుడు..

Jr NTR: ఇక జాతరే.. ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతున్న తారక్ మూవీ లైనప్

Jr Ntr

Jr NTR: 1000 కోట్ల జోష్ తో ట్రిపుల్ ఆర్ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్న యంగ్ టైగర్.. ఫ్యాన్స్ కోసం ఫుల్ గా సర్ ప్రైజెస్ రెడీ చేశారు. ట్రిపుల్ ఆర్ తో మిస్ చేసుకున్న మూవీ లైనప్ ఇప్పుడు క్లియర్ కాబోతుంది. ఆ ప్లాన్ లో భాగంగానే ముందు కొరటాల మూవీకి ముహూర్తం సెట్ చేసి.. ఆ తర్వాత మరిన్ని క్రేజీ కబుర్లను చెప్పబోతున్నారు.

Jr NTR-Alia: అలియా పెళ్లి.. టెన్షన్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్!

చరణ్ తో కలిసి మ్యాసివ్ హిట్ కొట్టిన తారక్.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై కాన్సట్రేషన్ పెంచేశారు. రామ్ చరణ్ లా క్రేజీ లైనప్ లేదని బాధపడుతున్న ఫ్యాన్స్ కోసం పాన్ ఇండియా స్టార్ గా ప్రమోటై.. నెక్ట్స్ ఆ రేంజ్ లోనే చుక్కలు చూపించబోతున్నారు ఎన్టీఆర్. తన 30వ సినిమాగా కొరటాల సినిమా రాబోతుంది. మేలో కొబ్బరికాయ కొట్టి జూన్ లో రెగ్యులర్ షూట్ కెళ్లేలా కొరటాల ప్రాజెక్ట్ సన్నద్ధమవుతోంది.

Jr NTR: చిల్ అవుతున్న తారక్.. వర్రీ అవుతున్న ఫ్యాన్స్!

తారక్ ట్రిపుల్ ఆర్, కొరటాల ఆచార్య లేట్ కారణంగా ఇప్పటికే ఈ సినిమా స్టార్ట్ కావడానికి టైమ్ తీసుకుంది. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల-ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న రెండో సినిమా ఇది. ట్రిపుల్ ఆర్ తో పెరిగిన పాన్ ఇండియా క్రేజ్ తో తారక్ కోసం పాన్ ఇండియా లైన్ నే కొరటాల లైన్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇందులో యంగ్ టైగర్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటించబోతుంది. ఇక ఈ ప్రాజెక్ట్ తో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ తో కలిసి వర్క్ చేయబోతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్.

Ram Charan-Jr NTR: ఆర్ఆర్ఆర్ సాలిడ్ కలెక్షన్స్.. నార్త్‌లో పెరిగిన తారక్-చెర్రీ రేంజ్!

కొరటాల సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రశాంత్ నీల్ తో వర్క్ చేయాలనేది ఎన్టీఆర్ ప్లాన్. 20 ఏళ్లుగా తారక్ అభిమానినని రీసెంట్ గా ప్రకటించిన ప్రశాంత్ నీల్.. ఆయన కోసం సూపర్ స్టోరీ రెడీ చేసాడని చెప్తున్నారు. కొరటాల ప్రాజెక్ట్ పూర్తి చేసి తారక్, సలార్ పనులయ్యాక ప్రశాంత్ నీల్ కలిసి ఈ ఇయర్ అక్టోబర్ లో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాదు.. అంతకుమించి అనేలా ఈ కాంబో సినిమాను సెట్ చేస్తున్నారు. యంగ్ టైగర్ సరసన హీరోయిన్ గా దీపికా పదుకోన్ ను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.