KA Paul : కేసీఆర్, కేటీఆర్‌లు జీవితాంతం ముఖ్యమంత్రులుగా ఉంటారని అనుకోకండి-కేఏ పాల్

తీన్మార్ మల్లన్న, విఠల్ విషయంలో కేసీఆర్ తండ్రిలా వ్యవహరించాలి. మీ పిల్లలు తప్పు చేస్తే క్షమించరా? అలాగే ఈ ఇద్దరినీ క్షమించండి.(KA Paul)

KA Paul : కేసీఆర్, కేటీఆర్‌లు జీవితాంతం ముఖ్యమంత్రులుగా ఉంటారని అనుకోకండి-కేఏ పాల్

KA Paul : తనదైన శైలి ప్రవర్తనతో, చేష్టలతో, మాటలతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఛాన్స్ చిక్కితే చాలు తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటారు. ప్రపంచ దేశాల అధ్యక్షులకు, ప్రధానులకు ఉచిత సలహాలు ఇస్తుంటారు. వారంతా తనకు బాగా క్లోజ్ అని చెప్పుకోవడం కేఏ పాల్ కు మాత్రమే తెలుసు. తాజాగా మరోసారి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జర్నలిస్టుల అరెస్ట్ పై స్పందించిన కేఏ పాల్.. తనదైన శైలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ కు హితవు పలికారు.

Also Read..Theenmar Mallanna : తీన్మార్ మల్లన్న అరెస్టు.. క్యూ న్యూస్ ఆఫీస్ లో పోలీసుల సోదాలు

”తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరికీ ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యమంత్రుల మనసులు మారాలని అందరం ప్రార్థన చేద్దాం. తెలంగాణలో అరెస్ట్ అయిన జర్నలిస్టు కుటుంబాలకు అండగా ఉంటా. తీన్మార్ మల్లన్న, విఠల్ విషయంలో కేసీఆర్ తండ్రిలా వ్యవహరించాలి. మీ పిల్లలు తప్పు చేస్తే క్షమించరా? అలాగే ఈ ఇద్దరినీ క్షమించండి. మల్లన్న, విఠల్ ఇద్దరూ హద్దు మీరి ప్రవర్తించి ఉండొచ్చు. అసభ్యకరంగా, అన్‌పార్లమెంటరీ పదాలతో మాట్లాడ్డం మంచిది కాదు.(KA Paul)

యథా రాజ తథా ప్రజ అంటారు. మీరు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. పోలీసులు కూడా తప్పుడు కేసులు పెట్టకండి. కేసీఆర్, కేటీఆర్‌లు జీవితాంతం ముఖ్యమంత్రులుగా ఉంటారని అనుకోకండి. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. మీరు ఏది చేస్తే.. మీకు అదే తిరిగొస్తుంది. మనమేమీ చైనా, ఇరాన్, నార్త్ కొరియాలో లేము. ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నామన్న విషయం మర్చిపోవద్దు” అని కేఏ పాల్ అన్నారు.

Also Read..Minister KTR : పేపర్ లీకేజీ వెనుక ఎవరున్నా వదిలిపెట్టం.. బీజేపీపై అనుమానం : మంత్రి కేటీఆర్

కాగా.. పోలీసులపై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తీన్మార్ మల్లన్నను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. నిన్న రాత్రి తీన్మార్ మల్లన్న సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిని హయత్‌నగర్ కోర్టులో హాజరుపర్చగా కోర్టు వారిని రిమాండ్‌కు ఆదేశించింది. దీంతో నిందితులను చర్లపల్లికి జైలుకు తరలించారు.

”మంగళవారం సాయంత్రం 5 గంటలకు పీర్జాదిగూడలోని రాఘవేంద్ర హోటల్ సమీపంలో ఇద్దరు కానిస్టేబుళ్లు మఫ్టీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో వారి వద్దకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు గొడవకు దిగారు. అనంతరం కానిస్టేబుళ్లను సమీపంలోనే ఉన్న క్యూ న్యూస్ కార్యాలయంలోకి లాక్కెళ్లారు. అక్కడ వారితో మల్లన్నతోపాటు కార్యాలయ సిబ్బంది వాదనకు దిగారు. కార్యాలయం చుట్టూనే ఎందుకు సంచరిస్తున్నారని గొడవ పడి వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు గాయపడిన కానిస్టేబుళ్లను రక్షించారు. వారి ఫిర్యాదు మేరకు మల్లన్న, ఆయన సిబ్బందిపై కేసు నమోదు చేశారు” అని పోలీసులు వెల్లడించారు.(KA Paul)

Also Read..Bandi Sanjay: సిట్ నోటీసులిస్తే భయపడతామా? సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే నా దగ్గర సమాచారం ఇస్తా..