Bandi Sanjay: సిట్ నోటీసులిస్తే భయపడతామా? సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే నా దగ్గర సమాచారం ఇస్తా..

సిట్ నోటీసులపై బండిసంజయ్ ఫైర్ అయ్యారు. సిట్ నోటీసులు ఇస్తే భయపడతామా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందు ముఖ్యమంత్రి, ఆయన కొడుకుకు సిట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే నా దగ్గరున్న సమాచారాన్ని అందజేస్తానని అన్నారు.

Bandi Sanjay: సిట్ నోటీసులిస్తే భయపడతామా? సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే నా దగ్గర సమాచారం ఇస్తా..

Bandi Sunjay

Updated On : March 22, 2023 / 12:36 PM IST

Bandi Sanjay: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) వ్యవహారంలో ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) కు సిట్ అధికారులు (SIT officials) మీదగ్గరి ఆధారాలతో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన విషయం విధితమే. ఆ నోటీసులపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. సిట్ నోటీసు (SIT Notice) లు ఇస్తే భయపడతామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు ముఖ్యమంత్రి, ఆయన కొడుకుకు సిట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే నా దగ్గరున్న సమాచారాన్ని అందజేస్తానని అన్నారు.

Bandi Sanjay : గ్రూప్-1 పరీక్షల్లో భారీ అక్రమాలు.. వారంతా బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులే-బండి సంజయ్

మున్సిపల్, ఐటీశాఖ మంత్రిగా విఫలమైన కేటీఆర్ ఎందుకు రాజీనామా చేయటం లేదో చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు. తన కుటుంబం కోసం ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలపై కేసీఆర్ ఉక్కుపాదం మోపాడని అన్నారు. పేపర్ లీకేజీపై మాట్లాడిన అనేక మంది మంత్రులకు సిట్ నోటీసులు ఎందుకు జారీ చేయడంలేదని సంజయ్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సహా.. ప్రతిపక్షాలన్నీ ప్రజల నుంచి వచ్చిన సమాచారంతోనే మాట్లాడుతామని, తప్పు చేస్తే కేసులు పెట్టుకోవచ్చునని, కానీ జర్నలిస్ట్‌లపై దాడులను ఖండిస్తున్నానని అన్నారు. జర్నలిస్టుల కుటుంబాలను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని సంజయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీడియాను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Bandi Sanjay: నిరుద్యోగులకు లక్ష నష్టపరిహారం ఇవ్వాలి.. కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి..

30లక్షల మంది జీవితాలను కేసీఆర్ సర్కార్ రోడ్డున పడేశాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిలియన్ మార్చ్ తరహాలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించి తీరుతామని సంజయ్ స్పష్టం చేశారు. సీఎం బిడ్డకోసం క్యాబినెట్ అంతా ఢిల్లీలో కూర్చోవటం దారుణమని సంజయ్ ఎద్దేవా చేశారు. గతంలో అటుకులు తిన్న కేసీఆర్ కుటుంబానికి వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ డౌన్‌ఫాల్ మెదలైందని, అన్ని శాఖలకు మంత్రిగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్‌ విడుదల చేస్తామని బండి సంజయ్ తెలిపారు.