Bandi Sanjay: నిరుద్యోగులకు లక్ష నష్టపరిహారం ఇవ్వాలి.. కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి..

దళితుల పట్ల, దళిత నియోజకవర్గాల పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయని, అంబేడ్కర్ జయంతి, వర్ధంతి సందర్భంగాకూడా కేసీఆర్ నివాళులు అర్పించలేదని సంజయ్ అన్నారు.

Bandi Sanjay: నిరుద్యోగులకు లక్ష నష్టపరిహారం ఇవ్వాలి.. కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి..

Bandi Sunjay

Bandi Sanjay: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల వేలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని, కష్టపడి చదివి నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నాంపల్లిలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం  సంజయ్ అధ్యక్షతన జరిగింది. పార్టీ జెండా ఆవిష్కరించి సమావేశాలను సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల 30లక్షల మంది నిరుద్యోగుల బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీక్ కేసులో కేటీఆర్‌ను  మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రేపు అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీక్ష చేస్తామని సంజయ్ అన్నారు. మంత్రి వర్గం నుంచి కేటీఆర్ ను బర్తరఫ్ చేసేవరకు పోరాటం చేస్తామని అన్నారు.

Bandi Sanjay : వాళ్లు బీజేపీ కాదు బీఆర్ఎస్.. బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయకుండానే ఉద్యోగం ఇచ్చారా-బండి సంజయ్

కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయని, అంబేడ్కర్ జయంతి, వర్ధంతి సందర్భంగా కేసీఆర్ నివాళులు అర్పించలేదని సంజయ్ అన్నారు. దళిత నియోజకవర్గాల పట్ల కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. కేసీఆర్ పొగిడిన శ్రీలంక, చైనా, పాకిస్థాన్ దేశాల పని అయిపోయిందని సంజయ్ ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కారుతోనే సాధ్యం అవుతుందని అన్నారు. ప్రజలకు మంచి చేయాలని సీఎం కేసీఆర్ ను సీఎంను చేస్తే కేసీఆర్ బిడ్డను కాపాడేందుకు మంత్రివర్గం మొత్తం ఢిల్లీ పోయిందని సంజయ్ విమర్శించారు.

Bandi Sanjay Explanation : రాష్ట్ర మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన బండి సంజయ్.. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ వివరణ

సీఎం కేసీఆర్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలపైన హత్యలు, అత్యాచారాలు జరిగినా పట్టించుకోవడం లేదని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంత్రులకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, ఏ శాఖ అయినా మంత్రి కేటీఆరే మాట్లాడుతున్నారని సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ కు పాలించమని ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే మిగులు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిండని సంజయ్ విమర్శించారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే సాధ్యమవుతుందని సంజయ్ అన్నారు.