Bandi Sanjay Explanation : రాష్ట్ర మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన బండి సంజయ్.. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ వివరణ

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విచారణకు హాజరయ్యారు. మహిళా కమిషన్ కు ఆయన వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్థించుకున్నారు.

Bandi Sanjay Explanation : రాష్ట్ర మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన బండి సంజయ్.. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ వివరణ

Bandi Sanjay (2)

Bandi Sanjay Explanation : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విచారణకు హాజరయ్యారు. మహిళా కమిషన్ కు ఆయన వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్థించుకున్నారు. తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలనే తాను మాట్లాడినట్లు సమాధానం ఇచ్చారు. కవితపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. రెండు పేజీల లేఖను ఆయన మహిళా కమిషన్ కు ఇచ్చారు. మహిళా కమిషన్ ముందు బండి సంజయ్ విచారణ ముగిసింది. ఇక బండి సంజయ్ సమాధానాలపై మహిళా కమిషన్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నేతలు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా కమిషన్ బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసింది. తన వ్యాఖ్యలపై సమాధానం ఇచ్చేందుకు వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది.

BRS Protest : ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు

ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కమిషన్ సోమవారం బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. మార్చి 15న ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు విచారణకు నేరుగా హాజరు కావాలని ఆదేశించింది. అయితే, ఈ నోటీసులు తీసుకునేందుకు బీజేపీ కార్యాలయ ప్రతినిధులు నిరాకరించారు. బండి సంజయ్‌కు వ్యక్తిగతంగా వచ్చిన నోటీసులను తామెలా తీసుకుంటామని బీజేపీ కార్యాలయ సిబ్బంది చెప్పింది. బండి సంజయ్ పార్లమెంటు సమావేశాల్లో ఉన్నందున నోటీసులను తాము తీసుకోలేమని తెలిపారు.

అయితే తెలంగాణ మహిళా కమిషన్ కు బండి సంజయ్ లేఖ రాశారు. బుధవారం విచారణకు హాజరు కావాలన్న మహిళా కమిషన్ నోటీసులపై ఆయన రిప్లై ఇచ్చారు. బుధవారం ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ బండి సంజయ్ ను ఆదేశించింది. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున మీరు చెప్పిన తేదీల్లో హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. మార్చి 18న ఏ సమయంలోనైనా హాజరయ్యేందుకు సిద్ధమని చెప్పారు.

Bandi Sanjay Comments: బండి సంజయ్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఆగ్రహం.. పోలీస్ కేసు నమోదు

ఈ మేరకు బండి సంజయ్ ఇవాళ శనివారం రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఆయనకు వ్యతిరేకంగా నిరసనలకు దిగాయి. బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. పలు పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బండిపై కేసు నమోదు చేశారు.

మహిళా కమిషన్ విచారణ ముగిసిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. మహిళా లోకానికి మంచి సందేశం ఇవ్వటానికే కమిషన్ విచారణకు హాజరయ్యానని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. పనికిరాని కమిషన్ ఉంటే ఎంత? లేకుంటే ఎంత? అని ఎద్దేవా చేశారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు జరపటం లేదో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

Bandi Sanjay: పేపర్ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ రాజీనామా చేయాలి.. కేసీఆర్ బిడ్డకు జైలు రెడీ అవుతోంది: బండి సంజయ్

రేణుక తల్లి బీఆర్ఎస్ సర్పంచ్, రేణుక కుటుంబం కోసమే పేపర్ లీకేజ్ అయిందని ఆరోపించారు. రాజశేఖర్ బ్యాగ్రౌండ్ తెలియకుండా కమిషన్ ఉద్యోగం ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. తన ఏడుపు తాను ఏడవకుండా.. బీజేపీ పాలిత రాష్ట్రాలపై పడటం కేటీఆర్ కు అలవాటుగా మారిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ కొట్టిన దెబ్బకు కేసీఆర్, కేటీఆర్ మైండ్ బ్లాక్ అయిందన్నారు.
27మంది ఇంటర్ విద్యార్థులను పొట్టన పెట్టుకున్న చరిత్ర కేటీఆర్ దని విమర్శించారు.

ధరణి, ఫైర్ యాక్సిడెంట్స్, కుక్కల దాడిలో ప్రాణాలు గాలిలో కలవటానికి కేటీఆర్ మంత్రిత్వ శాఖ కారణమని ఆరోపించారు. మహిళలను గౌరవించే పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టే విచారణకు వెళ్ళానని చెప్పారు. తప్పు చేయనప్పుడు వెళ్ళాల్సిందేనని చెప్పారు. తన స్టేట్మెంట్ ను మహిళా కమిషన్ రికార్డు చేసుకుందన్నారు. కేటీఆర్ కు కామన్ సెన్స్ ఉందో లేదో ప్రజలకు తెలుసన్నారు.