Anirudh : క‌మ‌ల్ హాస‌న్ సర్ నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు..

ఈ సినిమా సక్సెస్ లో ముఖ్య కారణం మ్యూజిక్ కూడా. తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ విక్రమ్ సినిమాకి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. అయితే అనిరుధ్ ని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ సక్సెస్ కి.............

Anirudh : క‌మ‌ల్ హాస‌న్ సర్ నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు..

Kamal Haasan (1)

Anirudh :  లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ హీరోగా విజ‌య్ సేతుప‌తి, ఫ‌హ‌ద్ ఫాసిల్, సూర్య ముఖ్య పాత్రల్లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విక్రమ్. ఈ సినిమాకి కమల్ హాసన్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. విక్రమ్ సినిమా భారీ విజయం సాధించి కలెక్షన్లలో దూసుకుపోతుంది. ఇప్పటికే విక్రమ్ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ గా 300 కోట్లు కలెక్ట్ చేసింది. చాలా సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ కి ఈ రేంజ్ హిట్ రావడంతో ఈ సినిమా విజయంపై కమల్ చాలా సంతోషంగా ఉన్నారు.

ఈ సినిమా విజయంపై కమల్ సంతోషం వ్యక్తం చేస్తూ సినిమా కోసం పని చేసిన పలువురికి స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి కోటి రూపాయల ఖరీదైన లెక్సస్ కారుని బహుమతిగా ఇచ్చారు. ఇక ఈ సినిమాకి పని చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి బైక్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ సినిమాలో స్పెషల్ రోల్ పోషించిన సూర్యకి ఇందులో తన క్యారెక్టర్ కి తగ్గట్టు రోలెక్స్ వాచ్ ని బహుకరించారు. దీంతో కమల్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Kamal Haasan : ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ తో నా అప్పులన్నీ తీర్చేస్తా..

ఇక ఈ సినిమా సక్సెస్ లో ముఖ్య కారణం మ్యూజిక్ కూడా. తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ విక్రమ్ సినిమాకి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. అయితే అనిరుధ్ ని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ సక్సెస్ కి అందరికి గిఫ్ట్స్ ఇస్తున్నారు మీకు క‌మ‌ల్ సర్ నుంచి గిఫ్ట్ ఏం రాలేదా అని అడగడంతో అనిరుధ్ మాట్లాడుతూ.. ”క‌మ‌ల్ హాస‌న్ సర్ నుంచి నాకు ఎలాంటి కానుక రాలేదు. అసలు నాకు క‌మ‌ల్ సర్ తో ప‌నిచేసే అవ‌కాశం రావ‌డమే పెద్ద గిఫ్ట్. నాకు సపరేట్ గా ఎలాంటి గిఫ్ట్స్ అవసరం లేదు” అని తెలిపాడు.