NBK 107 : బాలయ్య సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ హీరో

బాలయ్య తన తర్వాతి సినిమాని గోపీచంద్ మలినేనితో అనౌన్స్ చేసాడు. సంక్రాంతి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఇందులో కన్నడ స్టార్ హీరోను తీసుకున్నట్టు చిత్ర యూనిట్......

NBK 107 :  బాలయ్య సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ హీరో

Nbk 107

NBK 107 :  బాలకృష్ణ ఇటీవలే ‘అఖండ’ సినిమాతో వచ్చి భారీ విజయం సాధించాడు. ఈ సినిమా విడుదల అయి నెల రోజులు అవుతున్నా ఇంకా థియేటర్స్ ఫుల్ గా నడుస్తున్నాయి అంటే బాలయ్య మానియా ఎలాంటిదో అర్ధమవుతుంది. ఇక బాలయ్య తన తర్వాతి సినిమాని గోపీచంద్ మలినేనితో అనౌన్స్ చేసాడు. ఈ సినిమా ముహూర్తం షాట్ కూడా ఇటీవల పూర్తి అయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇటీవల ‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్నందుకు గోపీచంద్ ఈ సారి బాలయ్యతోనూ ఓ బ్లాక్ బస్టర్ తీయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే బాలయ్యకి బాగా కలిసొచ్చిన, బాగా పేరు తెచ్చిన ఫ్యాక్షన్ జోనర్ ని ఎంచుకున్నాడు. రాయలసీమ, కర్ణాటక బోర్డర్ లో జరిగే ఫ్యాక్షన్ కథతో ఈ సినిమాని తీయబోతున్నట్టు సమాచారం. కర్ణాటక బోర్డర్ లో కూడా సినిమా ఉండబోతుంది కాబట్టి కన్నడలో కూడా ఈ సినిమాని మార్కెట్ చేయాలనుకుంటున్నారు చిత్ర యూనిట్. అందుకే ఇందులో కన్నడ స్టార్ హీరోను తీసుకుంటున్నారు అని నిన్నటి వరకు వార్తలు వినిపించాయి. ఇవాళ సినిమా యూనిట్ అది కంఫర్మ్ చేసింది.

Vicky Kaushal : కత్రీనాకైఫ్ భర్త విక్కీ కౌశల్ పై కేసు నమోదు

ఈ సినిమాలో బాలయ్యకి విలన్ గా కన్నడ స్టార్ హీరోని తీసుకున్నారు. కన్నడలో హీరోగా ఊర మాస్ సినిమాలు చేసే దునియా విజయ్ ని బాలయ్య విలన్ గా ఎంపిక చేశారు. ఈవిషయాన్ని ఇప్పుడే చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే విలన్ పాత్రకి తీసుకున్నట్టు చెప్పకపోయినా ఇండస్ట్రీ సమాచారం ప్రకారం విలన్ క్యారెక్టర్ కే దునియా విజయ్ ని తీసుకున్నారని తెలుస్తుంది.

RGV : ఆర్జీవిని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చూడాలి

దునియా విజయ్ కన్నడలో మొదట చిన్న చిన్న పాత్రలే చేశాడు. అతను హీరోగా నటించిన ‘దునియా’ సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తర్వాత వరుసగా సినిమాలు చేశాడు. ఇప్పటిదాకా దాదాపు నలభై సినిమాల్లో నటించాడు విజయ్. ఇటీవలే ‘సలాగా’ అనే సినిమాతో వచ్చి కన్నడలో మంచి విజయం సాధించాడు. కన్నడ నుంచి వచ్చిన చాలా మంది స్టార్స్ తెలుగులో సక్సెస్ అయ్యారు. దీంతో తెలుగులో కూడా వాళ్ళ నెక్ట్ సినిమాలని మార్కెట్ చేసుకుంటున్నారు. దునియా విజయ్ కూడా విలన్ గా సక్సెస్ అయి తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకుంటాడేమో చూడాలి మరి.