RGV : ఆర్జీవిని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చూడాలి

తాజాగా ఇండస్ట్రీ పెద్దగా రామ్ గోపాల్ వర్మ ఉండాలంటూ ఓ డైరెక్టర్ ట్వీట్ చేశాడు. సినిమా టికెట్ల విషయంలో ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడకపోయినా ఆర్జీవీ మాత్రం స్పందించడం.........

RGV : ఆర్జీవిని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చూడాలి

Rgv

RGV :   గతంలో ఇండస్ట్రీ పెద్ద అనే అంశం కొన్ని రోజులు చర్చలకు దారి తీసింది. ‘మా’ ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. తాజాగా నిన్న మెగాస్టార్ చిరంజీవి ఈ అంశంపై మాట్లాడుతూ నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండను, కానీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉంటే మాత్రం ముందుకొస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేసిన సాయంత్రానికి మోహన్ బాబు సినిమా టికెట్ల ఇష్యూ గురించి మాట్లాడుతూ లేఖ రాయడం మరింత చర్చకి దారి తీసింది. అయితే కొందరు గతంలో మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్ద అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఇండస్ట్రీ పెద్దగా రామ్ గోపాల్ వర్మ ఉండాలంటూ ఓ డైరెక్టర్ ట్వీట్ చేశాడు. సినిమా టికెట్ల విషయంలో ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడకపోయినా ఆర్జీవీ మాత్రం స్పందించడం విశేషం. ఇటీవల ప్రతి ప్రెస్ మీట్ లోను ఇండస్ట్రీ సమస్యలపై, సినిమా టికెట్ల రేట్లు, థియేటర్ల మూసివేతపై ఆర్జీవీ మాట్లాడాడు. ఇలాంటి టైంలో ఇండస్ట్రీ పెద్ద అనే అంశం తెరపైకి రావడంతో ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్, ఆర్జీవీ శిష్యుడు అజయ్ భూపతి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు.

Shannu Deepu : షణ్ముఖ్ దీప్తి సునైనా విడిపోవడానికి కారణం ఎవరు?

”మా బాస్ రాంగోపాల్ వర్మని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చూడాలని నా కోరిక.. సామీ మీరు రావాలి సామీ.. ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా” అంటూ అజయ్ భూపతి తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి రామ్ గోపాల్ వర్మ ఫోటోను కూడా జత చేశాడు. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. మరి ఈ ట్వీట్ పై ఆర్జీవీ ఎలా స్పందిస్తాడో చూడాలి.