Vicky Kaushal : కత్రీనాకైఫ్ భర్త విక్కీ కౌశల్ పై కేసు నమోదు

బాలీవుడ్‌ యువ హీరో విక్కీ కౌశల్‌ ఇటీవలే కత్రీనా కైఫ్ ని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు పెళ్లి పనుల్లో బిజీ అయి షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చిన విక్కీ తాజాగా షూటింగ్స్ మొదలుపెట్టాడు.

Vicky Kaushal  : కత్రీనాకైఫ్ భర్త విక్కీ కౌశల్ పై కేసు నమోదు

Vicky Kaushal

Vicky Kaushal :  బాలీవుడ్‌ యువ హీరో విక్కీ కౌశల్‌ ఇటీవలే కత్రీనా కైఫ్ ని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు పెళ్లి పనుల్లో బిజీ అయి షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చిన విక్కీ తాజాగా షూటింగ్స్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం విక్కీ కౌశల్, సారా అలీఖాన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ లో జరుగుతోంది. తాజాగా ఈ షూట్ నుంచి ఓ వీడియో క్లిప్ లీక్ అయి బయటకి వచ్చింది. ఇందులో విక్కీ కౌశల్ సారా అలీఖాన్ ని బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్తాడు.

RGV : ఆర్జీవిని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చూడాలి

అయితే ఈ విషయంలో విక్కీ కౌశల్ పై కేసు నమోదు అయింది. ఇండోర్‌ కు చెందిన జైసింగ్‌ అనే వ్యక్తి విక్కీ కౌశల్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులో.. ”విక్కీ కౌశల్‌ నా అనుమతి లేకుండా తన ద్విచక్ర వాహన నంబర్‌ ని వాడుకున్నాడు. విక్కీ కౌశల్‌ కొత్త చిత్రంలో ఆయన నడిపే బైక్ కి ఉన్న నంబర్ నాదే. నా నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నా నంబర్‌ వాళ్లు వాడటం చట్ట వ్యతిరేకం. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి” అంటూ పేర్కొన్నాడు. పోలీసులు ఈ ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారు.