Karnataka elections 2023: మైకులు మూగబోయాయి.. ప్రచార రథాలు నిలిచాయి.. ఏపీ సరిహద్దుల్లో 57, తెలంగాణలో 24 చెక్‌పోస్టులు

Karnataka elections 2023: ప్రధాని మోదీ వారం రోజుల్లో 18 సభలు, 6 రోడ్ షోల్లో పాల్గొన్నారు.

Karnataka elections 2023: మైకులు మూగబోయాయి.. ప్రచార రథాలు నిలిచాయి.. ఏపీ సరిహద్దుల్లో 57, తెలంగాణలో 24 చెక్‌పోస్టులు

Karnataka elections 2023

Karnataka elections 2023: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి.. ప్రచార రథాలు నిలిచిపోయాయి. కర్ణాటకలో బీజేపీ,కాంగ్రెస్, జేడీఎస్ హోరాహోరీగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. బీజేపీ తరఫున అంతా తానై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ.

వారం రోజుల్లో 18 సభలు, 6 రోడ్ షోల్లో మోదీ పాల్గొన్నారు. 150 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాని, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, పలువురు సినీ తారలు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజలపై హామీలు గుప్పిస్తూ అధికారం కోసం ప్రచారం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, డీకే శివకుమార్, సిద్ధ రామయ్య. కర్ణాటక ఎన్నికల్లో కింగ్ మేకర్ కావాలని భావిస్తోంది జేడీఎస్.

224 అసెంబ్లీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. కర్ణాటక ఎన్నికల బరిలో మొత్తం 2,613 మంది అభ్యర్థులు నిలిచారు. వారిలో 2,427 మంది పురుషులు,184 మంది మహిళలు, ఇద్దరు ఇతర అభ్యర్థులు ఉన్నారు. 224 స్థానాల్లో బీజేపీ, 223 స్థానాల్లో కాంగ్రెస్, 207 స్థానాల్లో జేడీఎస్, 209 స్థానాల్లో ఆప్,133 స్థానాల్లో బీఎస్పీ, సిపిఎం 4, జేడీయూ 8, ఎన్పీపీ 2 స్థానాల్లో, 685 గుర్తింపు లేని పార్టీలు, 918 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

మద్యం పంపిణీపై నిఘా

కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కర్ణాటక వ్యాప్తంగా 58,282 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తోంది ఈసీ. ప్రచారం ముగిసిన అనంతరం స్థానికేతరులెవ్వరూ ఆయా నియోజకవర్గాల్లో ఉండకూడదంటూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. డబ్బు, మద్యం పంపిణీపై నిఘా పెట్టింది.

డబ్బు, మద్యం పంపిణీపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. కర్ణాటక సరిహద్దులోని ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా,తమిళనాడు, గోవా రాష్ట్రాల్లో 185 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కేరళలో 21, తమిళనాడు 25, ఏపీలో 57, తెలంగాణ 24, మహారాష్ట్ర లో 53, గోవాలో 5 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

తెలంగాణ సరిహద్దులు కల్బుర్గి వద్ద 8, యాదగిరి వద్ద 3, రాయచూర్ వద్ద 3, బీదర్ వద్ద 10 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ఏపీ సరిహద్దులు చిత్ర దుర్గ వద్ద 8, బళ్లారి వద్ద 13, రాయ్ చూర్ వద్ద 2, తుముకూరు వద్ద 12, కోలార్ వద్ద 9, చిక్ బళ్లాపూర్ వద్ద 9, కేజీఎఫ్ వద్ద 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.

భారీగా ధన ప్రవాహం

ఎన్నికల ప్రచారం వేళ ఇప్పటికే సుమారు రూ.400 కోట్ల విలువైన నగదు, లిక్కర్, బంగారం, బహుమతులు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రూ.110 కోట్ల నగదు, రూ.74 కోట్ల లిక్కర్, రూ.81 కోట్ల బంగారం, వెండి, రూ.22 కోట్ల బహుమతులు , రూ.18 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 2,346 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ కు ముందు రూ.58 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేశారు.

Karnataka elections 2023: కర్ణాటక ప్రజలకు మమతా బెనర్జీ సందేశం