Can’t quash Rape case : అత్యాచారం చేసి..ఆమెనే పెళ్లి చేసుకుంటే నేరం చేయనట్లా?కేసు విచారణ జరుపుతాం: హైకోర్ట్

అత్యాచారం చేసి..ఆమెనే పెళ్లి చేసుకుంటే నేరం చేయనట్లా? రేప్ కేసు విచారణ కొనసాగిస్తాం అని హైకోర్ట్ స్పష్టం చేసింది.

Can’t quash Rape case : అత్యాచారం చేసి..ఆమెనే పెళ్లి చేసుకుంటే నేరం చేయనట్లా?కేసు విచారణ జరుపుతాం: హైకోర్ట్

Can't Quash Rape Case

Can’t quash Rape case say court : యువతిపై అత్యాచారం చేసిన ఓ యువకుడికి కోర్టు షాక్ ఇచ్చింది. అలాగే అత్యాచార బాధితురాలికి కూడా షాక్ ఇచ్చింది. ఎలాగంటే..అత్యాచారం చేసిన యువతినే పెళ్లి చేసుకున్నాడు సదరు వ్యక్తి.వారికి ఓ బిడ్డ కూడా పుట్టింది. తరువాత సదరు యువతి ‘నాపై అత్యాచారం చేసిన వ్యక్తే నన్ను పెళ్లి చేసుకున్నాడు..కేసు కొట్టి వేయమని’ కోర్టును కోరింది. దానికి ధర్మాసనం వినూత్నంగా సమాధానమిచ్చింది. ‘అత్యాచారం చేసి..ఆమెనే పెళ్లి చేసుకుంటే నేరం చేయనట్లా? కేసు విచారణ జరిపుతాం అని స్పష్టంచేసిన కర్ణాటక హైకోర్టు స్పష్టంచేసింది.

కర్ణాటక విజయపుర జిల్లా బాసవానా బాగెవాడీలోని ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతున్న ఓ అత్యాచార కేసును కొట్టేయాలని అత్యాచార బాధితురాలు, నిందితుడు కర్ణాటక హైకోర్టుకు చెందిన కలబురిగి బెంచ్​ను ఆశ్రయించారు. తమకు ఇప్పుడు పెళ్లయిందని..బిడ్డ కూడా పుట్టిందని తాము ఇప్పుడు బాగానే ఉన్నామని..దయచేసి కేసును కొట్టివేయమని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై న్యాయ విచారణ కొనసాగిస్తే ఎలాంటి ప్రయోజనం లేదని బాధితురాలు తన పిటిషన్​లో కోర్టుకు వెల్లడించింది.

తనపై అత్యాచారం జరిగిన సమయంలో తన వయసు 19 ఏళ్లు అని బాధితురాలు తెలిపింది. ఈ పిటిషన్​పై విచారణ జరిపిన జస్టిస్​ హెచ్‌పీ సందేశ్​ నేతృత్వంలోని ధర్మాసనం .. బాధితురాలి అభ్యర్థనను తిరస్కరించింది. నేర స్వభావం, తీవ్రత, సామాజిక ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని కేసును రద్దు చేయడం కుదరదని..విచారణ కొనసాగుతుందని స్పష్టంచేసింది.

అత్యాచారం జరిగిన సమయంలో బాలిక మైనరా..? కాదా..? అనే విషయాన్ని ట్రయల్ కోర్టులో నిర్ధారించాల్సి ఉంటుందని జస్టిస్ సందేశ్ తెలిపారు. ఒక వేళ నిందితుడు బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడు అత్యాచారం చేసి ఉంటే ఐపీసీ 376 సెక్షన్ కింద శిక్ష నుంచి తప్పించుకోలేడని .. బాధితురాలితో రాజీ కుదుర్చుకున్నప్పటీకీ శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు.

సీఆర్​పీసీ సెక్షన్ 482 కింద ఓ కేసును రద్దు చేసే ముందు నేర స్వభావం, తీవ్రతను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును జస్టిస్ సందేశ్ ప్రస్తావించారు. ఇటువంటి ఘటనలు సమాజంపై ప్రభావం చూపే అవకాశం ఉందని..నిందితుడిపై కేసును రద్దు చేసేందుకు ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అక్టోబర్ 28న ఉత్తర్వులు జారీ చేశారు.