Summer : వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే కీరదోస!.

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కీరదోసకాయల్లో 95% నీరు ఉంటుంది. టాక్సిన్స్‌ని తొలగించడం ద్వారా శరీరాన్ని బాగా హైడ్రేట్‌గా ఉంచడాని, పోషణకు సహాయపడతాయి.

Summer : వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే కీరదోస!.

Cucumber

Summer : వేడి వాతావరణం కారణంగా వేసవిలో చాలా మంది త్వరగా అలసటకు గురవుతుంటారు. వేసవిలో శరీరం చల్లగా ఉండటానికి వివిధ రకాల జ్యూస్ లను తాగుతుంటారు. అయితే మండుతున్న ఎండలకు శరీరాన్ని డీహైడ్రేషన్ కు లోను కాకుండా హైడ్రేషన్ గా ఉంచేందుకు కీరదోస జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

కీరదోసకాయ శరీరానికి ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటి. కీరదోసలో పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్ కె, విటమిన్ సి, మెగ్నీషియం, రిబోఫ్లావిన్, బి-6, ఫోలేట్, పాంతోతేనిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, జింక్ మరియు సిలికా వంటి పోషకాలు ఉంటాయి. తక్కువ కేలరీల కలిగి ఉండే కూరగాయగా కీరదోసను చెప్పవచ్చు. 100 గ్రాముల కీరదోసలో కేవలం 16గ్రాముల కేలరీలు మాత్రమే ఉంటాయి.

కీరదోసకాయ ప్రయోజనాలు ;

1. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కీరదోసకాయల్లో 95% నీరు ఉంటుంది. టాక్సిన్స్‌ని తొలగించడం ద్వారా శరీరాన్ని బాగా హైడ్రేట్‌గా ఉంచడాని, పోషణకు సహాయపడతాయి. కీరదోసకాయలలో అధిక నీటి శాతం ఉండటం వల్ల శరీరాన్ని శుభ్రపరిచేలా పని చేస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.

2. చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది ; కీర దోసకాయలో ఉండే పొటాషియం, విటమిన్ ఇ చర్మానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కళ్ల ఉబ్బరం ,కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మచ్చల చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. చర్మాన్ని శుభ్రపరచడంలో, మూసుకుపోయిన రంధ్రాలను తెరవడంలో సహాయపడుతుంది. సన్‌బర్న్‌ల నుండి చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది.

3. బలమైన చిగుళ్ళు ,తాజా శ్వాస ; నోటి దుర్వాసన చికిత్సలో కీరదోస బాగా ఉపయోగపడుతుంది. సాంప్రదాయ ఆయుర్వేద ఔషధంగా కడుపులో అధిక వేడిని తగ్గిస్తుంది. అధిక వేడి వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. కీరదోసకాయ రసం తాగడం వల్ల బలహీనమైన చిగుళ్ళు, పైయోరియా వంటి నోటి సమస్యలను నయం చేయవచ్చని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

4. జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది ; కీరదోసకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే అధిక నీటి కంటెంట్ జీర్ణక్రియలను వేగవంతం చేస్తుంది.. దోసకాయ తొక్కలో ఉండే కరగని ఫైబర్ ఆహారం జీర్ణాశయంలోకి త్వరగా వెళ్లేలా చేస్తుంది. వేసవికాలంలో తినడానికి అనువైన అల్పాహారంగా కీరదోసను చెప్పవచ్చు. కీర దోసకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్టలో పుండ్లు, గుండెల్లో మంట, అసిడిటీ, అల్సర్ , మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

5. రక్తపోటును నియంత్రిస్తుంది ; కీర దోసకాయల్లో ఫైబర్, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి పోషకాలు రక్తపోటును తగ్గించడంలో ప్రభావవంతంగా దోహదపడతాయి. అధిక పొటాషియం ,నీటి కంటెంట్ కారణంగా మూత్రవిసర్జన లక్షణాలు రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.