Keerthi Suresh : ‘గుడ్ లక్ సఖి’ ట్రైలర్.. షూటర్‌గా కీర్తి సురేష్

‘గుడ్ లక్ సఖి’ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కింది. కీర్తి సురేష్ తో పాటు ఆది పినిశెట్టి, జగపతిబాబు ముఖ్య పాత్రలుగా తెరకెక్కింది. దేశంలో టాప్ షూటర్లను తయారు.......

Keerthi Suresh :  ‘గుడ్ లక్ సఖి’ ట్రైలర్.. షూటర్‌గా కీర్తి సురేష్

Keerthi Suresh (2)

 

Gud Luck Sakhi :  కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనాతో పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవల న్యూ ఇయర్ కి విడుదల చేస్తామని ప్రకటించినా అప్పుడు కూడా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా విడుదలకి మరో కొత్త తేదీని అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిన ‘గుడ్ లక్ సఖి’ సినిమాని జనవరి 28న విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

 

‘గుడ్ లక్ సఖి’ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కింది. కీర్తి సురేష్ తో పాటు ఆది పినిశెట్టి, జగపతిబాబు ముఖ్య పాత్రలుగా తెరకెక్కింది. దేశంలో టాప్ షూటర్లను తయారు చేస్తానని జ‌గ‌పతిబాబు ప్రకటించడంతో ట్రైల‌ర్‌ ప్రారంభమవుతుంది. బ్యాడ్‌ల‌క్ స‌ఖి గా ఓ పల్లెటూళ్ళో కీర్తి సురేష్ ఉంటుంది. తనకి అసలు అదృష్టమే లేదని అందరూ బ్యాడ్ లక్ సఖి అని అంటూ ఉంటారు. అయితే షూటింగ్ కి కీర్తి పేరును జ‌గ‌ప‌తిబాబుకు సూచిస్తాడు ఆది పినిశెట్టి. ఇంత‌లో షూటింగ్ మహిళల కోసం కాదు అని గ్రామస్తులు దీనిని వ్యతిరేకిస్తారు. అయినా కీర్తికి ట్రైనింగ్ ఇచ్చి కాంపిటీషన్స్ కి తీసుకెళ్తాడు. ఫ‌స్ట్ టైమ్ ఆమె టార్గెట్ రీచ్ అవ‌డంతో ఫెయిల్ అవుతుంది. మళ్ళీ కీర్తిని అంతా బ్యాడ్ లక్ సఖి అంటారు.

Vaishnav Tej : కేతికతో ‘రంగరంగ వైభవంగా’ వైష్ణవ్ తేజ్..

అయితే జ‌గ‌ప‌తి బాబు ఆమెను బాగా మోటివేట్ చేస్తాడు. ఈ సారి కాంపిటీషన్స్ లో కీర్తి గెలుస్తుంది. కథ మొత్తాన్ని ట్రైలర్ లోనే చూపించారు. బ్యాడ్ లక్ సఖి నుంచి గుడ్ లక్ సఖిగా కీర్తి సురేష్ ఎలా మారింది అనేదే కథ. కీర్తి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. కీర్తి అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.