Helmet in Car: కారులో హెల్మెట్ సరిగా పెట్టుకోలేదంటూ చలాన్ విధించిన పోలీసులు: అవాక్కైన వాహనదారుడు

మీరు హెల్మెట్ సరిగా పెట్టుకోలేదు. అందుకు మీకు రూ.500 చలాన్ విధిస్తున్నాము. వెంటనే చలాన్ మొత్తాన్ని చెల్లించండి" అంటూ చలాన్ పంపించారు పోలీసులు

Helmet in Car: కారులో హెల్మెట్ సరిగా పెట్టుకోలేదంటూ చలాన్ విధించిన పోలీసులు: అవాక్కైన వాహనదారుడు

Kerala

Helmet in Car: కారులో వెళ్తున్న ప్రయాణికుడొకరు హెల్మెట్ సరిగా పెట్టుకోలేదంటూ ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. అదేంటి..బైక్ పై ఉన్నపుడు కదా హెల్మెట్ పెట్టుకోవాల్సింది..అనుకుంటున్నారా. ఆ విషయం మనందరికీ తెలుసు, కానీ పోలీస్ కెమెరాకు తెలియదు కదా. వివరాల్లోకి వెళితే..కేరళకు చెందిన అజిత్ అనే ఓ కారు యజమానికి ఇటీవల ట్రాఫిక్ పోలీసుల నుంచి ఒక చలాన్ వచ్చింది. “మీరు హెల్మెట్ సరిగా పెట్టుకోలేదు. అందుకు మీకు రూ.500 చలాన్ విధిస్తున్నాము. వెంటనే చలాన్ మొత్తాన్ని చెల్లించండి” అంటూ చలాన్ పంపించారు పోలీసులు. అది చూసిన అజిత్ కంగుతిన్నాడు. ఎందుకంటే అతనికి కారు తప్ప బైక్ లేదు. కారులో వెళ్లే తనకు హెల్మెట్ సరిగా పెట్టుకోలేదంటూ చలాన్ రావడంపై విస్మయం వ్యక్తం చేశాడు అజిత్.

Also read:Allahabad High Court: భర్తపై తప్పుడు రేప్ కేసు.. భార్యకు పదివేల ఫైన్

విషయాన్నీ స్థానిక ట్రాఫిక్ పోలీసుల దృష్టికి, రవాణాశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లాడు. అయితే దీనిపై కొంత విచారణ జరిపిన అధికారులు..ఎక్కడో తప్పు జరిగిందని గ్రహించారు. చలాన్ కు సంబందించిన ఫోటోను మరొకసారి పరిశీలించిన అధికారులు అసలు విషయం గ్రహించి నాలుక్కరుచుకున్నారు. వాస్తవానికి ఆ చలాన్ ఒక ద్విచక్ర వాహనదారుడిని ఉద్దేశించి పంపించాల్సింది. అజిత్ కారు నెంబరు పోలి ఉన్న బైక్ నెంబరును ట్రాఫిక్ పోలీసులు ఫోటో తీశారు. అయితే కంప్యూటర్ లో చలాన్ వివరాలు ఎక్కించేటప్పుడు చివరి సంఖ్యలు 77కి బదులుగా 11ని ఎక్కించడంతో అసలు పొరపాటు చోటుచేసుకుంది.

Also read:Rahul Gandhi: మోదీ గారికి ధన్యవాదాలు, ఉద్యోగాలపై 45 కోట్ల మంది ఆశలు కోల్పోయారు: మోదీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

దీంతో అజిత్ చలాన్ ను రద్దు చేసిన అధికారులు తిరిగి ద్విచక్రవాహనదారుడికి చలాన్ విధించారు. సదరు ద్విచక్ర వాహనదారుడు..హెల్మెట్ పెట్టుకున్నా..దానికి ఉండే స్ట్రాప్ (క్లిప్)ను పెట్టుకోలేదని ఆసమయంలో బైక్ పై వెనుక సీట్లో మరొక వ్యక్తి కూడా ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. కాగా, అకారణంగా తనకు చలాన్ విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అజిత్ విషయాన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని స్థానిక అధికారులను హెచ్చరించారు.

Also read:Tesla Cars in India: భారత్ లో అమ్మండి, కానీ చైనా నుంచి ఇక్కడికి తీసుకురాకండి: టెస్లా కంపెనీకి కేంద్ర మంత్రి గడ్కరీ సూచన