PM Modi AP Tour : ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. శ్రీశైలం, కర్నూలులో మోదీ మినిట్ టు మినిట్ పర్యటన షెడ్యూల్ ఇదే..

PM Narendra Modi AP Tour : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని..

PM Modi AP Tour : ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. శ్రీశైలం, కర్నూలులో మోదీ మినిట్ టు మినిట్ పర్యటన షెడ్యూల్ ఇదే..

PM Modi AP Tour

Updated On : October 16, 2025 / 8:44 AM IST

PM Narendra Modi AP Tour : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీకి రానున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించనున్నారు. అనంతరం కర్నూలుకు చేరుకొని రూ.13,429 కోట్లు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తరువాత కర్నూలులో తలపెట్టిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.

ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలికేందుకు కర్నూలు నగరం ముస్తాబైంది. ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ పేరుతో కర్నూల్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పేందుకు ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సుమారు మూడు లక్షల మంది హాజరవుతారని అంచనా. అందుకు తగిన విధంగా కర్నూలు శివారులోని నన్నూరు వద్ద 450 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. సభకు 40ఎకరాల్లో మూడు భారీ టెంట్లు నిర్మించారు.

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ మాట్లాడనున్నారు. మంత్రి టీజీ భరత్ స్వాగతోపన్యాసం చేస్తారు.

మోదీ పర్యటన సాగేదిలా..
♦ ఉదయం 7 గంటల 20 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి కర్నూలు ఎయిర్ పోర్టుకు బయలుదేరనున్న ప్రధాని మోదీ
♦ 9 గంటల 50 నిమిషాలకు కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ప్రధాని మోదీ
♦ 9 గంటల 55 నిమిషాలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్ నుంచి సుండిపెంటకు హెలికాఫ్టర్లో బయలుదేరనున్న మోదీ
♦ 10 గంటల 55 నిమిషాలకు సుండిపెంటకు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకోనున్న ప్రధాని
♦ 11 గంటల 15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల వరకు శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్ధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
♦ దాదాపు 50 నిమిషాల పాటు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ప్రధాని మోదీ.
♦ మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు శివాజి స్ఫూర్తి కేంద్రం సందర్శన
♦ 12.15 గంటల నుంచి 12.35 గంటల వరకు శివాజి దర్బార్ హాల్, ధ్యానమందిరంను సందర్శించనున్న మోదీ
♦ అక్కడనుంచి గెస్ట్‌హౌస్‌కు చేరుకొని మధ్యాహ్నం 1.15 గంటల వరకు విశ్రాంతి తీసుకోనున్న మోదీ.
♦ మధ్యాహ్నం 1. 20 గంటలకు గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి సుండిపెంటకు చేరుకొని.. అక్కడ నుంచి హెలికాఫ్టర్ ద్వారా 2 గంటల 20 నిమిషాలకు కర్నూలుకు చేరుకోనున్న ప్రధాని.
♦ మధ్యాహ్నం 2.30గంటకు రాగమయూరి గ్రీన్‌హిల్స్ నన్నూరు విలేజ్‌లో ఏర్పాటు చేసిన సూపర్ జిఎస్టి – సూపర్ సేవింగ్ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ
♦ సభా ప్రాంగణంలో పలు ప్రాజెక్డులకు శంకుస్ధాపనలు,‌ ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ.
♦ బహిరంగ సభ అనంతరం సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు రోడ్డు మార్గాన హెలిప్యాడ్ వద్దకు.. అక్కడనుంచి 4 గంటల 45 నిమిషాలకు కర్నూల్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకోనున్న మోదీ
♦ కర్నూల్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్న ప్రధాని మోదీ

శంకుస్థాపనలు ఇలా.
♦ కడప జిల్లా కొప్పర్తిలో రూ.2,136 కోట్లతో పారిశ్రామిక కేంద్రం.
♦ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రూ.2,786 కోట్లతో పారిశ్రామిక కేంద్రం.
♦ కర్నూలులో రూ.2,886 కోట్లతో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టులు.
♦ సబ్బవరం నుంచి షీలానగర్‌ వరకు 13 కి.మీ. మేర రూ.964 కోట్లతో నిర్మించే ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే.
♦ కొత్తవలస-విజయనగరం మధ్య రూ.493 కోట్లతో చేపట్టే నాలుగో రైల్వేలైన్‌
♦ పెందుర్తి-సింహాచలం నార్త్‌ స్టేషన్ల మధ్య రూ.184 కోట్లతో నిర్మించే రైల్వే వంతెన.
ప్రారంభోత్సవాలు..
♦ చిత్తూరు జిల్లాలో రూ.200 కోట్లతో చేపట్టిన ఇండేన్‌ బాట్లింగ్‌ ప్లాంట్‌.
♦ పీలేరు-కల్లూరు సెక్షన్‌లో భాకరాపేట వరకు 18 కి.మీ. మేర జాతీయ రహదారి-71లో నాలుగు వరుసలు.
♦ కృష్ణా జిల్లా నిమ్మకూరులో రూ.362 కోట్లతో చేపట్టిన రక్షణ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్ట్‌.
♦ గుడివాడ-నూజెండ్ల రైల్వేస్టేషన్ల మధ్య గుడివాడలో ఎన్‌హెచ్‌-165పై నిర్మించిన వంతెన.
♦ అనంతపురం-కళ్యాణదుర్గం-రాయదుర్గం హైవేలో బెళుగుప్ప మండలం ఎన్‌.గుండ్లపల్లి వద్ద 2 కి.మీ. మేర నిర్మించిన బైపాస్‌.
♦ కడప/నెల్లూరు సరిహద్దు నుంచి సీఎస్‌ పురం వరకు ఎన్‌హెచ్‌-167బిలో 41 కి.మీ. మేర విస్తరించిన రెండు వరుసల హైవే.
♦ ఆరు కి.మీ. మేర నిర్మించిన కనిగిరి బైపాస్‌.
♦ ముద్దనూరు-కడప హైవేలో కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై నిర్మించిన వంతెన.