Vijayendar : ఓ పక్క క్లోజ్ ఫ్రెండ్ మరణం.. మరో పక్క ఫస్ట్ సినిమా రిలీజ్.. పాపం ఎవరికీ ఇలా జరగకూడదు..

టాలీవుడ్ లో ఓ విషాద సంఘటన నెలకొంది. (Vijayendar)

Vijayendar : ఓ పక్క క్లోజ్ ఫ్రెండ్ మరణం.. మరో పక్క ఫస్ట్ సినిమా రిలీజ్.. పాపం ఎవరికీ ఇలా జరగకూడదు..

Vijayendar

Updated On : October 16, 2025 / 7:02 AM IST

Vijayendar : టాలీవుడ్ లో ఓ విషాద సంఘటన నెలకొంది. దర్శకుడి క్లోజ్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ సమయానికి చనిపోయారు. ప్రియదర్శి, నిహారిక NM జంటగా తెరకెక్కిన మిత్రమండలి సినిమా నేడు అక్టోబర్ 16న రిలీజ్ కానుంది.(Vijayendar)

ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం పనిచేసిన డైరెక్టర్ క్లోజ్ ఫ్రెండ్ సడెన్ గా పడిపోయాడు. అతన్ని హాస్పిటల్ లో చేర్చి వస్తున్నాము అని తెలిపారు.

Also Read : Mithra Mandali Review : ‘మిత్ర మండలి’ మూవీ రివ్యూ.. స్పూఫ్ కామెడీతో నవ్వుకోవాల్సిందే..

బుధవారం రాత్రి మరోసారి ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించగా బన్నీవాసు మాట్లాడుతూ.. మా ఎవ్వరికి పది రోజులుగా సరిగ్గా నిద్ర లేదు. డైరెక్టర్ క్లోజ్ ఫ్రెండ్ మాతో ఈ సినిమాకు పనిచేసాడు. అతను కూడా మాతో నిద్ర లేకుండా ఓ పది రోజుల నుంచి పని చేస్తున్నాడు. మొన్న సడెన్ గా పడిపోయాడు. తీసుకెళ్లి హాస్పిటల్ లో జాయిన్ చేసాము. నిన్న రాత్రి అతను చనిపోయాడు. అందరం ఇంకా ఆ ఎమోషన్ లోనే ఉన్నాము అంటూ తెలిపారు.

ఈ సినిమా దర్శకుడు విజయేందర్ కి డైరెక్టర్ గా ఇదే మొదటి సినిమా. దర్శకుడిగా మొదటి సినిమా రిలీజ్ అవుతున్న ఇలాంటి సమయంలో క్లోజ్ ఫ్రెండ్, అది కూడా తనతో పాటు సినిమాకు పనిచేసిన వ్యక్తి మరణించడం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటన ఎవరికీ రాకూడదు పాపం అని విచారం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రారంభంలో అతని ఫోటో షేర్ చేసి అతనికి నివాళులు అర్పించారు మిత్ర మండలి మూవీ టీమ్.

Also Read : Raavu Balasaraswathi Devi : టాలీవుడ్ లో విషాదం.. తొలితరం నేపథ్య గాయని కన్నుమూత..