Raavu Balasaraswathi Devi : టాలీవుడ్ లో విషాదం.. తొలితరం నేపథ్య గాయని కన్నుమూత..

తెలుగు పరిశ్రమలో తొలితరం గాయనీగాయకుల్లో ఒకరైన రావు బాలసరస్వతి దేవి కన్నుమూశారు. (Raavu Balasaraswathi Devi)

Raavu Balasaraswathi Devi : టాలీవుడ్ లో విషాదం.. తొలితరం నేపథ్య గాయని కన్నుమూత..

Raavu Balasaraswathi Devi

Updated On : October 15, 2025 / 1:57 PM IST

Raavu Balasaraswathi Devi : టాలీవుడ్ లో విషాదం నెలకొంది. తెలుగు పరిశ్రమలో తొలితరం గాయనీగాయకుల్లో ఒకరైన రావు బాలసరస్వతి దేవి కన్నుమూశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.

తిరుపతి దగ్గర వెంకటగిరిలో పుట్టిన బాల సరస్వతి ఆరేళ్ళప్పటి నుంచే సంగీతం మీద మక్కువ చూపించి పాటలు పాడేది. 1939 లో మొదటగా తెలుగులో మహానంద అనే సినిమాకు గాయనిగా పాటలు పాడారు. ఆ తర్వాత చెంచు లక్ష్మి, లైలా మజ్ను, షావుకారు, స్వప్న సుందరి, దేవదాసు, పెళ్ళిసందడి.. ఇలా అనేక సూపర్ హిట్ సినిమాల్లో పాడారు. తెలుగులోనే కాక తమిళ్, కన్నడ భాషల్లో కూడా బాల సరస్వతి పాటలు పాడారు.

Also See : Sambarala Yeti Gattu : సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటి గట్టు గ్లింప్స్ లాంచ్ ఈవెంట్.. ఫొటోలు..

1980 నుంచి బాల సరస్వతి సినిమాలకు దూరంగా ఉన్నారు. కేవలం సింగర్ మాత్రమే కాకుండా నటిగా కూడా కెరీర్ ఆరంభంలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. 1928 లో జన్మించిన బాల సరస్వతి 97 ఏళ్ళ వయసులో వయోభారంతో, ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు.