ఓటమితో ఆరంభం.. రాహుల్ అధ్భుత ఫీల్డింగ్.. కోహ్లీ చెత్త రికార్డు

ఓటమితో ఆరంభం.. రాహుల్ అధ్భుత ఫీల్డింగ్.. కోహ్లీ చెత్త రికార్డు

Kl Rahuls Amazing Fielding In First T201

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో, ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను టీమ్ ఇండియా ఓటమితో ప్రారంభించాల్సి వచ్చింది. తొలి మ్యాచ్‌లోనే మోర్గాన్ కెప్టెన్‌గా ఉన్న ఇంగ్లీష్ జట్టు భారత్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు.. భారత్‌ను 124 పరుగులకే కట్టడి చెయ్యగా.., 125 పరుగుల లక్ష్యాన్ని సులభంగా చేధించి 2 వికెట్ల తేడాతో గెలిచింది ఇంగ్లాండ్ జట్టు. ఈ మ్యాచ్‌లో భారత బౌలింగ్.. భారత బ్యాటింగ్ రెండూ ప్రభావవంతంగా కనిపించలేదు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో ఓటమి పాలవ్వగా.. మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ మాత్రమే మెరుగ్గా రాణించాడు. అత్యధికంగా 67 పరుగులు సాధించగా.., విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. భారత కెప్టెన్‌గా ఉండి అత్యధిక సార్లు డకౌవుట్ అయిన మొదటి భారత ఆటగాడిగా చెత్త రికార్డుకు ఎక్కాడు కోహ్లా. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ 14వ సారి డకౌట్ అయ్యాడు. అంతకుముందు సౌరవ్ గంగూలీ (13 సార్లు) రికార్డును బద్దలు కొట్టాడు.

బ్యాటింగ్‌లో ఒక్క పరుగుకే అవుట్ అయి, నిరాశపర్చిన భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ మాత్రం.. ఫీల్డింగ్‌లో అదరగొట్టాడు. బౌండరీ లైన్ దగ్గర కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసంతో అభిమానులను అలరించాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జోస్ బట్లర్ భారీ సిక్సర్‌కి ప్రయత్నించగా.. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కెఎల్ రాహుల్, గాల్లోకి ఎగిరి సిక్స్ వెళ్లకుండా ఆపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.