Kolkata : భారత్ లో తొలిసారి..కోల్‌కతాలో అండర్‌వాటర్‌ ‘మెట్రో రైలు’..

భారత్ లో తొలిసారి కోల్‌కతా మెట్రోలో భాగంగా అండర్‌వాటర్‌ మెట్రోను అందుబాటులోకి రానుంది. హుగ్లీ నది గుండా హౌరా కు ప్రయాణించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Kolkata : భారత్ లో తొలిసారి..కోల్‌కతాలో అండర్‌వాటర్‌ ‘మెట్రో రైలు’..

Howrah Metro Station Will Be The Deepest In The Country

howrah metro station will be the deepest in the country : భారత్ లో తొలిసారి కోల్‌కతా మెట్రోలో భాగంగా అండర్‌వాటర్‌ మెట్రోను తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. సెక్టార్‌5 నుంచి హుగ్లీ నది గుండా హౌరా కు ప్రయాణించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికోసం ప్రత్యేకంగా టన్నెల్‌ను నిర్మించనున్నారు. 2023 నాటికి దీన్ని ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు.

నీటిలో ఈ మెట్రో మొత్తం ప్రయాణ దూరం 16.6 కిలోమీటర్లు. కాగా..అండర్‌గ్రౌండ్‌లోనే 10.8 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందులో 520 మీటర్ల మేర నీళ్ల మధ్య నుంచి దూసుకెళ్తుంది. నీళ్లలో మెట్రో రైలులో దూసుకుపోవటం తలచుకుంటేనే భలే గమ్మత్తుగా ఉంది కదూ..ఈ మెట్రో రైలు నిర్మాణం పూర్తి అయితే ఆ అనుభూతిని భారత్ లో తొలిసారిగా కలకత్తా వాసులు ఆస్వాదించనున్నారు. ఈ మెట్రోకు మొత్తం స్టేషన్లు 11 ఉంటాయి. అదే అండర్ గ్రౌండ్ లో రెండు స్టేషన్లు ఉండనున్నాయి.

కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ (KMRC) జంట సొరంగాలను కలుపుకోవడానికి హుగ్లీ నదిపై సుమారు 500 మీటర్ల వరకు విస్తరించి ఉన్న తూర్పు-పశ్చిమ కారిడార్‌ను విస్తరించింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా..నీటి అడుగున మెట్రో రైలును KMRC నిర్మించనుంది. రైలు మునిగినప్పుడు 10-అంతస్తుల నిర్మాణానికి సమానమైన లోతులో ప్రయాణిస్తుంది.

1.4 మీటర్ల డల్పు గల కాంక్రీట్ రింగులతో నిర్మించిన జంట సొరంగాలు మెట్రో రైలులో నీటి అడుగున భాగాన నిర్మించనున్నారు. సొరంగాల్లోకి నీరు రాకుండా..వాటికి హైడ్రోఫిలిక్ రబ్బరు పట్టీలు అమర్చనున్నారు. ఈ ప్రాజెక్ట్ దాదాపు రూ. 8,600 కోట్లు ఖర్చు అంచనా వేశారు అధికారుల. మార్చి 2023 నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.